Komatireddy Venkat Reddy | ఎంత కరువొచ్చినా సాగునీరివ్వొచ్చు
Komatireddy Venkat Reddy | రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ (Srisailam Dead Storage) నుంచి రైతులకు సాగునీరివ్వొచ్చని (Irrigation Water) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు.
- ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తయితే ఇది సాధ్యమే
- జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నా
- వచ్చే రెండేళ్లలో మట్టి రోడ్డు లేకుండా చేస్తా
- నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ (Srisailam Dead Storage) నుంచి రైతులకు సాగునీరివ్వొచ్చని (Irrigation Water) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. అయితే ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తయితేనే ఇది సాధ్యమన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించొచ్చని చెప్పారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నానన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో జిల్లాలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు అత్యంత కీలకమైనవి. రైతులకు సంబంధించి ఈ పదవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులకు సేవ చేసే అవకాశం వీటి ద్వారా లభిస్తుంది. నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్లగొండ మార్కెట్‌కు సంబంధించి రెండవ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తును ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నాయి. ఇది గర్వకారణం.
ఎస్ఎల్బీసీ ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా జిల్లా అంతటికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను తిరిగి చేపట్టాం. దురదృష్టవశాత్తు మధ్యలో మళ్లీ పనులు ఆగగా ఇటీవలే తిరిగి ప్రారంభించాం. చురుకుగా కొనసాగుతున్నాయి. బ్రాహ్మణ వెల్లేములను కూడా తమ హయాంలోనే చేపట్టాం. ఇప్పటివరకు 35000 ఎకరాలకు సాగునీరు అందించాం. లక్ష ఎకరాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
రైతులకు సేవ చేయడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి. ఏఎంఆర్పీ కాలువల లైనింగును 450 కోట్ల రూపాయలతో చేపట్టాం. ముశంపల్లి సబ్ స్టేషన్, రోడ్డు మంజూరు చేయించాం. జిల్లాలో కాలువలు, రిజర్వాయర్లు పూర్తయితే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అవుతాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని మంత్రి కోమటిరెడ్డి తెలియజేశారు.
అంతకుముందు నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బీ హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా వి.శ్రీనివాస్ గౌడ్‌తో పాటు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?
- ●Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?
- ●Debit Card Insurance | డెబిట్ కార్డుపై రూ.2 లక్షల బీమా.. చాలా మందికి తెలియని విషయం..
- ●Stone Pelting Attack | కాంగ్రెస్ నేతల బస్సుపై రాళ్ల దాడి.. ఎక్కడ జరిగిందంటే!
- ●ASUS Zenbook 14 | పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లతో అసుస్ కొత్త ల్యాప్‌టాప్.. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్..
- ●Vemula Veeresham | ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం..

Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?

Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?

Debit Card Insurance | డెబిట్ కార్డుపై రూ.2 లక్షల బీమా.. చాలా మందికి తెలియని విషయం..

Stone Pelting Attack | కాంగ్రెస్ నేతల బస్సుపై రాళ్ల దాడి.. ఎక్కడ జరిగిందంటే!






