త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | పెళ్లి రోజు నాడు…. కొత్త కారు కొన్న అల్లు అర్జున్ – ధ‌ర ఎంతంటే?

పెళ్లి రోజు సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్ట్‌లీ కారును కొనుగోలు చేశాడు. అమెరిక‌న్ బ్రాండ్ చెందిన‌ ఇన్ఫినిటీ క్యూ 60 అనే కారును కొన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ కారు ధ‌ర ఎంతంటే?

N

Entertainment | Published On Mar 6, 2026, 8.18 pm IST

Allu Arjun | పెళ్లి రోజు నాడు…. కొత్త కారు కొన్న అల్లు అర్జున్ – ధ‌ర ఎంతంటే?
Advertisement

Allu Arjun | పెళ్లి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కాస్ట్‌లీ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశాడు. కారుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. శుక్ర‌వారం (నేడు) అల్లు అర్జున్‌, స్నేహా దంప‌తులు త‌మ ప‌దిహేన‌వ పెళ్లి రోజును జ‌రుపుకున్నారు. పెళ్లి రోజు సంద‌ర్భంగా త‌న భార్య స్నేహాతో క‌లిసి దిగిన ఓ ఫొటోను అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "మ‌న‌ది ప‌దిహేనేళ్ల బంధం. నువ్వు లేక‌పోయింటే మ‌న జ‌ర్నీ ఇలా ఉండేది" కాదంటూ ఈ ఫొటోను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.

రెండు కోట్లకుపైనే...

కాగా త‌మ పెళ్లి రోజు సంద‌ర్భంగా అల్లు అర్జున్ కాస్ట్‌లీ ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశాడు. స‌రిగ్గా పెళ్లి రోజు కారు త‌మ ఇంటికి డెలివ‌రీ అయ్యేలా ప్లాన్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఇన్ఫినిటీ క్యూ 60 అనే ల‌గ్జ‌రీ కారును కొన్న‌ట్లు స‌మాచారం. అమెరిక‌న్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు ధ‌ర కోటిన్న‌ర‌  నుంచి రెండు కోట్ల మధ్య ఉంటుంద‌ని స‌మాచారం. విదేశాల నుంచి ఈ కారును ప్ర‌త్యేకంగా అల్లు అర్జున్ దిగుమ‌తి చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కారును కొనుగోలు చేసిన ఫ‌స్ట్ ఇండియ‌న్ సెలిబ్రిటీ అల్లు అర్జున్ అని  టాక్ వినిపిస్తోంది.

ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్‌...

అల్లు అర్జున్ వ‌ద్ద ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ కార్స్ ఉన్నాయి. రోల్స్ రాయిస్ క‌లినాన్‌, రేంజ్ రోవ‌ర్ వోగ్‌, హ‌మ్మ‌ర్ హెచ్ 2, లెక్సాస్ ల‌గ్జ‌రీతో పలు ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు.  తాజాగా అత‌డి గ్యారేజీలోకి మ‌రో కారు చేరిన‌ట్లు అభిమానులు చెబుతోన్నారు.అల్లు శిరీష్ పెళ్లికి గిఫ్ట్‌గా ఇవ్వ‌డానికి కొనుగోలు చేశాడా? లేదంటే త‌న పెళ్లి రోజు కోసమే కొన్నాడా అన్న‌ది చూడాల్సిందేన‌ని అభిమానులు అంటున్నారు.

నేడు పెళ్లి...

కాగా నేడు అల్లు శిరీష్ పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. కొల్లూరు లోని ఈవెంట్ స్పేస్ ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రుగుతోన్న ఈ వివాహ వేడుక‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంత మంది స‌న్నిహితులు, రాజ‌కీయ నాయ‌కులు మాత్ర‌మే హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ ప్ర‌ముఖులు కోసం మార్చి 2న ప్రీ వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఏర్పాటుచేశారు.

సైన్స్ ఫిక్ష‌న్ మూవీ...

కాగా ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చేస్తోన్నాడు అల్లు అర్జున్‌. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు డిఫ‌రెంట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో దీపికా ప‌దుకొనే, ర‌ష్మిక మంద‌న్న, జాన్వీ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

;

Advertisement
Advertisement