త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ స‌ర్టిఫికేట్ అందుకున్న‌ అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ రాకా మూవీ గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేసింది. రికార్డ్ స‌ర్టిఫికేట్‌ను అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ అట్లీ అందుకున్నారు. రాకా ఎందులో గిన్నిస్ రికార్డ్‌ను క్రియేట్ చేసిందంటే?

N

Entertainment | Published On Sep 21, 2026, 6.46 pm IST

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ స‌ర్టిఫికేట్ అందుకున్న‌ అల్లు అర్జున్‌
Advertisement

Allu Arjun |  అల్లు అర్జున్ రాకా మూవీ రిలీజ్‌కు ముందే గిన్నిస్ బుక్‌లో చోటు ద‌క్కించుకుంది. గిన్నిస్ రికార్డ్ స‌ర్టిఫికేట్‌ను అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ అట్లీ అందుకున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.

అవ‌తార్‌...అవెంజ‌ర్స్‌...

ప్ర‌స్తుతం రాకా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అవ‌తార్‌, అవెంజ‌ర్స్‌, ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్‌తో పాటు హాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌కు ఉప‌యోగించిన మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని రాకా కోసం వాడుతున్నారు.

మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ...

రాకాలో 37 మంది యాక్ట‌ర్ల ఎక్స్‌ప్రెష‌న్ల‌ను ఒకే సారి మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో రియ‌ల్ టైమ్‌లో షూట్ చేశారు. ఈ విష‌యంలో రాకా.... గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకుంది. ఈ మేర‌కు గిన్నిస్ బుక్ సంస్థ ప్ర‌తినిధుల రికార్డ్ స‌ర్టిఫికేట్‌ను హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్ట‌ర్ అట్లీకి అంద‌జేశారు. ఈ ఫొటోను నిర్మాణ సంస్థ ప‌న్ పిక్చ‌ర్స్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

న‌లుగురు హీరోయిన్లు...

ఈ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో దీపికా ప‌డుకోణ్‌తో పాటు జాన్వీక‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్ కూడా క‌థానాయిక‌లుగా క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాకా మూవీకి సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ట్రిపుల్ రోల్‌...

రాకా మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. తండ్రిగా, ఇద్ద‌రు కొడుకులుగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో ఆయ‌న పాత్ర సాగ‌నున్న‌ట్లు చెబుతున్నారు. రాకా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో ఓ సూప‌ర్ హీరో మూవీ చేయ‌బోతున్నాడు అల్లు అర్జున్‌.

Advertisement
Advertisement