త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త‌మిళ‌నాడు సీఎం అవుతా – వైర‌ల్ అవుతోన్న త్రిష ఓల్డ్ కామెంట్స్‌

గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మొత్తం ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఏమిట‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లే విజ‌య్‌, త్రిష జంట‌గా ఓ పెళ్లి వేడుక‌లో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

N

Entertainment | Published On Mar 7, 2026, 8.21 pm IST

Trisha | త‌మిళ‌నాడు సీఎం అవుతా – వైర‌ల్ అవుతోన్న త్రిష ఓల్డ్ కామెంట్స్‌
Advertisement

Trisha | ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష మ‌ధ్య ఉన్న బంధ‌మేమిట‌న్న‌ది కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, అత‌డి భార్య సంగీత మ‌ధ్య విభేదాల‌కు త్రిష‌నే కార‌ణ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ సంగీత ఇటీవ‌లే కోర్టును ఆశ్ర‌యించింది. త్రిష‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న విజ‌య్ భార్యాపిల్ల‌ల‌ను దూరం పెట్టాడంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. త్రిష కార‌ణంగానే విజ‌య్‌కి సంగీత విడాకులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. ఈ రూమర్ల‌ను నిజం చేస్తూ త్రిష‌తో క‌లిసి విజ‌య్ ఓ సినీ నిర్మాత కొడుకు రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యారు. ఇన్‌డైరెక్ట్‌గా త్రిష‌తో త‌న రిలేష‌న్‌ను ఈ రిసెప్ష‌న్ ద్వారా క‌న్ఫామ్ చేశాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు.

పోటీ చేస్తుందా...

వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ నుంచి త్రిష పోటీచేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్ల నేప‌థ్యంలో త్రిష ఇచ్చిన ఓ ఓల్డ్ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

సీఎం అవుతా...

2004లో ఓ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మిళ‌నాడుకు సీఎం కావాల‌న్న‌ది త‌న క‌ల అని త్రిష చెప్పింది. మీ భ‌విష్య‌త్తు ప్లాన్స్, గోల్స్ ఏమిట‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు త‌మిళ‌నాడుకు "సీఎం కావాల‌ని ఉంది. వ‌చ్చే ప‌దేళ్ల‌లోనే ఈ క‌ల‌ను నేర‌వేర్చుకుంటా" అని త్రిష అన్న‌ది. సీఎం అయితే ఏం చేస్తార‌ని వెంట‌నే త్రిష‌ను యాంక‌ర్ మ‌రో ప్ర‌శ్న అడిగింది. "ముందు మీరంతా ఓటు వేసి న‌న్ను గెలిపించండి. ఆ త‌ర్వాత ఏం చేస్తానో చెబుతా" అంటూ త్రిష చెప్పింది.
అప్పుడు త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. త‌ప్ప‌కుండా త్రిష త‌మిళ‌నాడుకు సీఎం అవుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. టీవీకే పార్టీ నుంచే త్రిష ముఖ్య‌మంత్రి అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ త‌ర‌ఫున చెన్నై నుంచే త్రిష‌, విజ‌య్ పోటీ చేయ‌బోతున్న‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement