త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రివ్యూ – హైప‌ర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ న‌వ్వించిందా?

హ‌ర్ష‌చెముడు, హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఈటీవీ విన్ ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ బాబు డేగ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్‌సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? అంటే?

N

Entertainment | Published On Oct 10, 2026, 9.05 pm IST

Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రివ్యూ – హైప‌ర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ న‌వ్వించిందా?
Advertisement

Web Series Review |  టాలీవుడ్ క‌మెడియ‌న్ హ‌ర్ష‌చెముడు, హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ బాబు డేగ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో శుక్ర‌వారం రిలీజైంది. ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్, శ్రావ్య చౌద‌రి కీల‌క పాత్ర‌లో న‌టించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే...

పెళ్లి కష్టాలతో...

శ్రీనివాస‌రావుకు ఐదెక‌రాల పొలంతో పాటు రెండు రైస్‌మిల్లులు ఉంటాయి. ఊరిలో డ‌బ్బు, ప‌ర‌ప‌తి ఉన్న అత‌డి కొడుకు తేజ‌ను (హ‌ర్ష చెముడు) పెళ్లి చేసుకోవ‌డానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. ఉద్యోగం సంపాదిస్తేనే పెళ్లి జ‌రుగుతుంద‌ని ఓ స్నేహితుడు ఇచ్చిన ఐడియాలో హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌పై ఎలాంటి నాలెడ్జ్ లేక‌పోయినా త‌న‌కున్న తెలివితేట‌ల‌తో ఓ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. అదే కంపెనీలో మ‌ధు (ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్‌) టీమ్‌లీడ‌ర్‌గా ప‌నిచేస్తుంది. తండ్రి బ‌ల‌వంతంతో ఓ రోజు పెళ్లి చూప‌లుకు వెళ‌తాడు తేజ‌. అక్క‌డ పెళ్లికూతురిగా మ‌ధు క‌నిపిస్తుంది. తేజ అంటే త‌న‌కు ఇష్టం అని మ‌ధు చెబుతుంది. కానీ ఆరు నెల‌ల త‌ర్వాతే పెళ్లి జ‌ర‌గాల‌ని కండీష‌న్ పెడుతుంది. అప్ప‌టివ‌ర‌కు తేజ‌, మ‌ధు క‌లిసి ఒకే ఫ్లాట్‌లో ఉండాల్సివ‌స్తుంది. తేజ ఆఫీస్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేసే నాయుడిది (జీవ‌న్ కుమార్‌)మ‌రో క‌థ‌. సునీత అనే అమ్మాయిని ఇష్ట‌ప‌డుతుంటాడు నాయుడు. నాయుడు మేనేజ‌ర్ అయితే...ఆమె మెయిడ్‌...త‌న ప్రేమ‌ను ఆమెకు చెప్ప‌డానికి తంటాలు ప‌డుతుంది. టీమ్ లీడ‌ర్ గోపికి (హైప‌ర్ ఆది) చిరాకు ఎక్కువ‌. త‌న కోపం ప్ర‌స్టేష‌న్ మొత్తం త‌న కింద ప‌నిచేసే అనూష‌పైన చూపిస్తుంటాడు. కొత్త నంబ‌ర్‌తో అప‌రిచితురాలిగా గోపితో ఫోన్‌లో మాట్లాడుతూ అత‌డితో ప్రేమ‌లో ప‌డుతుంది అనూష‌. తాను ప్రేమించిన అమ్మాయి అనూష అనే నిజం గోపికి తెలిసిందా? తేజ‌తో పెళ్లికి ఆరు నెల‌లు టైమ్ కావాల‌ని మ‌ధు ఎందుకు కండీష‌న్ పెట్టింది? త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ను సునీత‌కు నాయుడు చెప్పాడా? అన్న‌దే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ వెబ్‌సిరీస్ మిగిలిన క‌థ‌.

కామెడీ టార్గెట్‌...

మూడు జంట‌లు, వారి ప్రేమ క‌ష్టాల‌ను వినోదాత్మ‌కంగా ఆవిష్క‌రిస్తూ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు బాబు డేగ‌ల‌. ఆడియెన్స్‌ను న‌వ్వించ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకొని ప్ర‌తి సీన్‌ను రాసుకున్నారు. హైప‌ర్ ఆది, జీవ‌న్‌, హ‌ర్ష చెముడు లాంటి క‌మెడియ‌న్లు ఉండ‌టం కూడా సిరీస్‌కు ప్ల‌స్స‌య్యింది. ఒక‌రి కామెడీలో డౌన్ కాగానే మ‌రొక‌రు లీడ్ తీసుకుంటూ న‌వ్వించారు.
త‌న కొడుకు పెళ్లి కాలేద‌ని హీరో తండ్రి మ‌ద‌న‌ప‌డే సీన్‌తో ఈ సిరీస్ మొద‌ల‌వుతుంది. కొడుకును ప్రేమ‌లో దించ‌డం కోసం తండ్రి స్వ‌యంగా రంగంలోకి దిగి అమ్మాయిల‌ను బ‌తిమిలాడ‌టం, ఆ క్ర‌మంలో వ‌చ్చే ఫ‌న్‌తో ఆరంభ స‌న్నివేశాలు న‌వ్వించాయి. ఆ త‌ర్వాత క‌థ మొత్తం సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో న‌డుస్తుంది.

బోర్ కొట్ట‌కుండా..

సాఫ్ట్‌వేర్ గురించి ఏం తెలియ‌క‌పోయినా చాలా తెలుసున‌ని బిల్డ‌ప్‌లు ఇచ్చే పాత్ర‌లు, డౌట్ రాగానే త‌ప్పించుకొని కోవ‌డానికి వారు ప‌డే తిప్ప‌ల‌తో ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది.
జీవ‌న్‌ను ఆఫీస్ ఎంప్లాయ్స్ అడిగే ప్ర‌శ్న‌లు...హైప‌ర్ ఆది, శ్రావ్య చౌంద‌రి మ‌ధ్య సాగే సంభాష‌లు బోర్ కొట్ట‌కుండా సిరీస్‌ను న‌డిపించారు.
ఫ‌న్ మీద పెట్టిన ఫోక‌స్ మిగిలిన స్టోరీపై కూడా పెడితే బాగుండేది. కీల‌క‌మైన తేజ, మ‌ధు ల‌వ్‌స్టోరీ అంత క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు. చివ‌ర‌లో తేజ‌ప్రేమ‌ను మ‌ధు అర్థం చేసుకునే సీన్ కూడా ఆర్టిఫీషియ‌ల్‌గా ఉంది. కామెడీ ఆరంభంలో బాగున్నా చివ‌ర‌లో ఆ ఫ్లో క‌నిపించ‌లేదు.

హైప‌ర్ ఆది పాత్ర హైలైట్‌...

ఈ సిరీస్‌కు హైప‌ర్ ఆది పాత్ర హైలైట్‌గా నిలిచింది. జ‌బ‌ర్ధ‌స్థ్‌లో ఆది పంచ్‌లు, కామెడీని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను ఈ సిరీస్ మెప్పిస్తుంది. సినిమాలు, హీరోలు, సోష‌ల్ మీడియా మీమ్స్‌ను ఉద్దేశించి ఆది వేసే సెటైర్లు న‌వ్వించాయి. జీవ‌న్‌లోని కామెడీ యాంగిల్‌ను ద‌ర్శ‌కుడు బాగా వాడుకున్నాడు. ఇంగ్లీష్ రాకా, సాఫ్ట్‌వేర్ గురించి ఏం తెలియ‌క అత‌డు ప‌డే తిప్ప‌లు ఫ‌న్నీగా ఉంటాయి. హ‌ర్ష చెముడు కామెడీ ప‌రంగా ఈ సిరీస్‌కు వీక్‌గా నిలిచాడు. ముగ్గురు హీరోయిన్ల‌లో అనూష పాత్ర చేసిన శ్రావ్య చౌద‌రి ఎక్కువ‌గా హైలైట్ అయ్యింది. టెక్నిక‌ల్‌గా సిరీస్ బాగుంది. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉన్నాయి.

జ‌బ‌ర్ధ‌స్థ్ శైలి కామెడీతో సాగే వెబ్‌సిరీస్ ఇది. పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement