త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Movie | య‌శ్ టాక్సిక్‌లో లేడీ విల‌న్ – హ్యుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

య‌శ్ టాక్సిక్ మూవీ నుంచి ఆదివారం మ‌రో అప్‌డేట్ వ‌చ్చేసింది. హ్యుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. టాక్సిక్ మూవీలో హ్యుమా ఖురేషి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగు9తోంది.

N

Entertainment | Published On Dec 28, 2025, 7.03 pm IST

Toxic Movie | య‌శ్ టాక్సిక్‌లో లేడీ విల‌న్ – హ్యుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
Advertisement

Toxic Movie |  కేజీఎఫ్ 2 త‌ర్వాత య‌శ్ హీరోగా న‌టిస్తున్న టాక్సిక్ కోసం పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టాక్సిక్ లో హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ఓ ప్రొడ్యూస‌ర్‌గా కూడా య‌శ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ మూవీకి క‌థ‌ను కూడా అందించారు.
టాక్సిక్‌లో న‌లుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. న‌య‌న‌తార‌, కియారా అద్వానీ, రుక్మిణి వ‌సంత్‌తో పాటు తారా సుతారియా క‌థానాయిక‌లుగా క‌నిపించ‌నున్నారు. రుక్మిణి వ‌సంత్ మిన‌హా మిగిలిన ముగ్గురు హీరోయిన్లు టాక్సిక్‌తోనే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టి హ్యూమా ఖురేషి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.
ఎలిజ‌బెత్ లుక్‌...
ఆదివారం మేక‌ర్స్ హ్యుమా ఖురేషి ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఎలిజ‌బెత్ అనే క్యారెక్ట‌ర్‌లో ఈ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి క‌నిపించ‌బోతుంది. ఈ పోస్ట‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ బ్లాక్ డ్రెస్‌లో రెట్రో కారు ముందు నిల్చొని డిఫ‌రెంట్ లుక్‌లో హ్యుమా క‌నిపిస్తోంది. ఆమె వెనుక స్మ‌శానం ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

విల‌న్‌గా...

టాక్సిక్‌లో హ్యుమా ఖురేషి విల‌న్‌గా న‌టించ‌నుంద‌ట‌. పాజిటివ్ యాంగిల్‌తో మొద‌లై నెగెటివ్‌లోకి ట‌ర్న్ అయ్యే ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. య‌శ్‌కు ధీటుగా ఈ బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్‌ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం.
ఎలిజ‌బెత్ క్యారెక్ట‌ర్ కోసం ఎవ‌రిని తీసుకోవాలా అని చాలా ఆలోచించామ‌ని, ఈ పాత్ర‌కు న‌ట‌నానుభ‌వంతో పాటు బ‌ల‌మైన స్క్రీన్ ప్ర‌జెన్స్ ఉన్న న‌టి అవ‌స‌ర‌మైంద‌ని గీతూ మోహ‌న్ దాస్ చెప్పింది. హ్యుమా ఖురేషి తాను ఊహించిన దానికి మించి ఎలిజ‌బెత్‌ పాత్ర‌కు ప్రాణం పోసింద‌ని పేర్కొన్న‌ది. టాక్సిక్‌తో ఎవ‌రూ ఊహించ‌ని ఓ క‌థ‌ను వెండితెర‌పై చెప్ప‌బోతున్నామ‌ని హ్యూమా ఖురేషి త‌న పాత్ర గురించి ట్వీట్ చేసింది. ఎలిజ‌బెత్ క్యారెక్ట‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఫైర్‌లా ఉంటుంద‌ని అన్న‌ది.

మార్చిలో రిలీజ్‌...

టాక్సిక్ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. మార్చి 19న భార‌తీయ భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మార్చి 19న య‌శ్ టాక్సిక్‌తో పాటు ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ 2, అడివి శేష్ డెకాయిట్ రిలీజ్ కాబోతున్నాయి. ఆ త‌ర్వాత వారంలో నాని ప్యార‌డైజ్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. వారం గ్యాప్‌లో ఐదు పాన్ ఇండియ‌న్ సినిమాలు రిలీజ్ కాబోతుండ‌టం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement