త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Highest Flops | 180 సినిమాలు డిజాస్ట‌ర్స్‌ – ఇండియాలోనే అత్య‌ధిక‌ ఫ్లాప్‌లు ఉన్న హీరో అత‌డే – అయినా సూప‌ర్ స్టార్‌

ఇండియాలోనే అత్య‌ధిక ఫ్లాప్ సినిమాలు చేసిన హీరోగా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి రికార్డ్ క్రియేట్ చేశారు. యాభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి 350 సినిమాలు చేయ‌గా...అందులో 180 సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Mar 27, 2026, 8.00 pm IST

Highest Flops |  180 సినిమాలు డిజాస్ట‌ర్స్‌ – ఇండియాలోనే అత్య‌ధిక‌ ఫ్లాప్‌లు ఉన్న హీరో అత‌డే – అయినా సూప‌ర్ స్టార్‌
Advertisement

Highest Flops | ఐదారు ఫ్లాప్‌లు ఎదురైతే చాలు ఎంత పెద్ద హీరో కెరీర్ అయినా డౌన్ అవుతుంది. అత‌డిపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కొద‌వే ఉండ‌దు. ఆ హీరోకు అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఫ్లాప్ హీరో వైపు క‌న్నెత్తి చూడ‌టానికి కూడా భ‌య‌ప‌డ‌తారు.కానీ బాలీవుడ్ హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి కెరీర్ మొత్తంలో 180 ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినా 1990 ద‌శ‌కంలో బాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగారు. ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఇండియాలోనే హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్‌ అందుకున్న హీరోల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.

డిస్కో డ్యాన్స‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌...

1976లో వ‌చ్చిన మృగ‌యా సినిమాతో హీరోగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి. తొలి సినిమాతోనే నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు. 1992లో వ‌చ్చిన డిస్కో డ్యాన్స‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి పేరు బాలీవుడ్‌లో మారుమోగింది. యూత్ ఐకాన్‌గా మారిపోయారు. డిస్కో డ్యాన్స‌ర్ సూప‌ర్ హిట్‌తోప‌దేళ్ల వ‌ర‌కు డేట్స్ ఖాళీ లేనంత బిజీ అయ్యారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి. నెల‌కో సినిమా చొప్పున ఒక్కో ఏడాది ప‌ది నుంచి ప‌దిహేను వ‌ర‌కు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి మూవీస్‌ రిలీజ్ అవుతూ వ‌చ్చాయి. 1989లో అత‌డు హీరోగా న‌టించిన 19 సినిమాలు రిలీజ్ కావ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒకే ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే మిథున్ చ‌క్ర‌వ‌ర్తి చేసిన ఈ సినిమాలు చాలా వ‌ర‌కు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.

180 ఫ్లాప్‌లు...

యాభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 350కిపైనే సినిమాలు చేశారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి. అందులో 180 సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఇందులో ఓ 47 సినిమాలు పెట్టిన బ‌డ్జెట్‌లో స‌గం కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాయి. 1993 నుంచి 1998 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ఐదేళ్ల గ్యాప్‌లోనే మిథున్ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన 33 సినిమాలు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. అన్ని ఫ్లాపులు వ‌చ్చినా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి క్రేజ్ తో పాటు అవ‌కాశాలు త‌గ్గ‌లేదు.

తెలుగులో...

తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గోపాల‌గోపాల‌తో పాటు ఆది పినిశెట్టి మ‌లుపు మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఫౌజీలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement
Advertisement