త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamal Haasan – Rajinikanth | క‌మ‌ల్‌హాస‌న్ – ర‌జ‌నీకాంత్ కాంబోలో వ‌చ్చిన సినిమాలు ఇవే – అన్నింటిలో త‌లైవార్ విల‌న్‌

46 ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రాబోతుంది. నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ప్రోమోను శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ సినిమా కంటే ముందు ర‌జ‌నీ, క‌మ‌ల్ క‌లిసి 18 సినిమాలు చేశారు.

N

Entertainment | Published On Feb 21, 2026, 4.17 pm IST

Kamal Haasan – Rajinikanth | క‌మ‌ల్‌హాస‌న్ – ర‌జ‌నీకాంత్ కాంబోలో వ‌చ్చిన సినిమాలు ఇవే – అన్నింటిలో త‌లైవార్ విల‌న్‌
Advertisement

Kamal Haasan - Rajinikanth | దాదాపు న‌ల‌భై ఆరేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్‌ సూప‌ర్ స్టార్స్ క‌మ‌ల్‌హాస‌న్, ర‌జ‌నీకాంత్ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రూ సూప‌ర్ స్టార్స్ కాంబినేష‌న్‌లో రాబోతున్న మ‌ల్టీస్టార‌ర్‌కు జైల‌ర్ ఫేమ్ నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌నివారం ఈ మూవీ ప్రోమోను అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించారు. వారి స్వాగ్‌, మ్యాన‌రిజ‌మ్స్, డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఫ‌న్నీగా రూపొందిన ఈ ప్రోమోలో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు డైరెక్ట‌ర్ నెల్స‌న్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ క‌నిపించారు. ఈ ప్రోమోలో ర‌జ‌నీ సెలెక్ట్ చేసిన వాటిని కాద‌ని క‌మ‌ల్‌.... క‌మ‌ల్ ఎంచుకున్న వాటిని వ‌ద్ద‌ని ర‌జ‌నీకాంత్ వేర్వేరు డ్రెస్‌ల‌తో ఎంట్రీ ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది. కంప్లీట్ రెట్రో స్టైల్ మ్యూజిక్‌, విజువ‌ల్స్‌తో ఈ ప్రోమో సాగింది. ఈ ప్రోమో తెలుగు వెర్ష‌న్‌కు క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పారు.

ఎవ‌రూ హీరో...

ప్రోమో చివ‌ర‌లో ఎవ‌రూ హీరో అని నెల్స‌న్‌ను క‌మ‌ల్‌హాస‌న్ అడిగారు.. వెంట‌నే ర‌జ‌నీకాంత్ కూడా అడుగుతున్నాడు క‌దా చెప్పండి ఎవ‌రూ హీరో అని అన‌డంతో ప్రోమో ఎండ‌య్యింది.
త్వ‌ర‌లోనే క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ షూటింగ్ మొద‌లుకాబోతుంది. ఈ సినిమాను త‌మిళ‌నాడు డిప్యూటీ సీఏం ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాజీవ్ మీన‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ర‌జ‌నీ విల‌న్‌....

ర‌జ‌నీకాంత్ క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 18 సినిమాలు వ‌చ్చాయి. వీటిలో చాలా సినిమాల్లో ర‌జ‌నీకాంత్ విల‌న్‌గా న‌టించారు. చివ‌ర‌గా ర‌జ‌నీ, క‌మ‌ల్ 1979లో రిలీజైన అల్లావుద్దీన్ అద్భుత విళ‌క్కుమ్ క‌లిసి న‌టించారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కే బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అపూర్వ రాగంగ‌ల్... క‌మ‌ల్‌హాస‌న్, ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మొద‌టి సినిమా ఇది. ఇందులో క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టించ‌గా...ర‌జ‌నీకాంత్ విల‌న్ పాత్ర చేశాడు.

సెకండ్ హీరో...

ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన మూండ్రు ముడిచ్చు, అంతులేని క‌థ‌, 16 వ‌య‌తినిలే, అవ‌ర్గ‌ల్ ఆడు పులి అట్టం, అల్లా వుద్దీన్ అద్భుత విళ‌క్కుమ్‌ల‌లో విల‌న్ పాత్ర‌ల‌తో ర‌జ‌నీకాంత్ అద‌ర‌గొట్టారు.
ఇళమై ఊంజలాడుగిరదు, నినైతాలే ఇరుక్కుమ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్ మెయిన్ హీరోగా న‌టించ‌గా...ర‌జ‌నీ సెకండ్ హీరో రోల్స్ చేశాడు. సూప‌ర్ స్టార్స్‌గా మారిన త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమాలు చేయ‌లేదు.

 

Advertisement
Advertisement