త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Halle Berry | 59 ఏళ్ల వ‌య‌సులో ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్ – నాలుగో పెళ్లికి రెడీ

59 ఏళ్ల వ‌య‌సులో ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ న‌టి హాలీ బెర్రీ పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. సింగ‌ర్ వ్యాన్ హంట్‌తో త‌న ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా హాలీ బెర్రీకి ఇది నాలుగో వివాహం.

N

Entertainment | Published On Feb 7, 2026, 4.12 pm IST

Halle Berry | 59 ఏళ్ల వ‌య‌సులో ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్ – నాలుగో పెళ్లికి రెడీ
Advertisement

Halle Berry | ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ హాలీ బెర్రీ 59 ఏళ్ల వ‌య‌సులో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. సింగ‌ర్ వ్యాన్ హంట్‌ను పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌త ఆరేళ్లుగా ఈ జంట లివింగ్ రిలేష‌న్‌లో ఉన్నారు. 2021 ఆస్కార్ వేడుక‌లో రెడ్ కార్పెట్‌పై మొద‌టిసారి వ్యాన్ హంట్‌తో క‌లిసి హాలీ బెర్రీ క‌నిపించ‌డంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు పుకార్లు వినిపించాయి. ఆ త‌ర్వాత ప‌లు వేడుక‌ల్లో జంట‌గా క‌నిపించారు.

పుకార్లు షికారు...

మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా హాలీ బెర్రీ, వ్యాన్ హంట్ విడిపోయిన‌ట్లుగ‌త గ‌త కొద్ది రోజులుగా హాలీవుడ్ వ‌ర్గాల్లో పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో హాలీకి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాన‌ని, కానీ ఆమె మాత్రం ఇంకా ఎస్ చెప్ప‌లేదంటూ వ్యాన్ హంట్ పేర్కొన్నారు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు నిజ‌మేనంటూ ప్ర‌చారం జ‌రిగింది.
ఈ పుకార్ల‌ను స్వ‌యంగా హాలీ బెర్రీ కొట్టిప‌డేసింది. ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె వ్యాన్ హంట్‌తో త‌న ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడా చూపించింది. త్వ‌ర‌లోనే తాము వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పెళ్లి డేట్‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు.

నాలుగో వివాహం...

కాగా హాలీ బెర్రీకి ఇది నాలుగో వివాహం. డేవిడ్ జ‌స్టిన్ అనే బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్‌ను 1993లో పెళ్లిచేసుకుంది హాలీ బెర్రీ. నాలుగేళ్ల‌కే అభిప్రాయ‌భేదాల కార‌ణంగా భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది. 2001లో ఎరిక్ బెనెట్ అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివాహ‌మాడింది. రెండో పెళ్లి స‌జావుగా సాగ‌లేదు. 2005లో ఎరిక్‌, హాలీ బెర్రీ విడాకుల‌తో త‌మ బంధానికి వీడ్కోలు ప‌లికారు. ఆ త‌ర్వాత 2013లో హాలీవుడ్ యాక్ట‌ర్ ఒలివియ‌ర్ మార్టినెజ్‌ను పెళ్లాడిన హాలీ బెర్రీ 2016లో అత‌డి నుంచి విడిపోయింది. గాబ్రియ‌ల్ ఆబ్రీ అనే మోడ‌ల్‌ హాలీ బెర్రీ ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. కాగా 59 ఏళ్ల వ‌య‌సులో వ్యాన్ హంట్‌తో నాలుగో పెళ్లికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆస్కార్ విజేత‌...

ఎక్స్‌మెన్ సిరీస్‌, డై అన‌ద‌ర్ డే, ది కాల్‌, క్యాట్ ఉమెన్‌తో పాటు ప‌లు హాలీవుడ్ సినిమాలు హాలీ బెర్రీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2001లో వ‌చ్చిన మాన్‌స్ట‌ర్ బాల్స్ సినిమాకు బెస్ట్ యాక్ట‌ర్‌గా ఆస్కార్ గె లుచుకుంది. ఈ అవార్డును అందుకున్న మొద‌టి ఆఫ్రో అమెరిక‌న్ యాక్ట‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement
Advertisement