త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Msvpg Movie | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుకు షాకిచ్చిన‌ హైకోర్టు – 42 కోట్ల లెక్క‌లు తేల్చాల‌ని ఆదేశం

చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీపై హైకోర్టులో మ‌రో పిటిష‌న్ ధాఖ‌లైంది. టికెట్ రేట్ల పెంపు ద్వారా సినిమాకు వ‌చ్చిన 42 కోట్ల ఆదాయాన్ని రిక‌వ‌రీ చేయాలంటూ శ్రీనివాస‌రెడ్డి అనే లాయ‌ర్ హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది.

N

Entertainment | Published On Jan 24, 2026, 3.01 pm IST

Msvpg Movie | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుకు షాకిచ్చిన‌ హైకోర్టు – 42 కోట్ల లెక్క‌లు తేల్చాల‌ని ఆదేశం
Advertisement

Msvpg Movie | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీకి హైకోర్టులో మ‌రో ఎదురుదెబ్బ త‌గిలేలా క‌నిపిస్తోంది. టికెట్ ధ‌ర‌ల పెంపు ద్వారా వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌ను రిక‌వ‌రీ చేయాలంటూ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది. చిరంజీవి హీరోగా న‌టించిన ఈ మూవీ ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డంతో పాటు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం మెమో జారీ చేసింది. ఈ మోమోను స‌స్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పాదూరి శ్రీనివాస‌రెడ్డి అనే లాయ‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. టికెట్ ధ‌ర‌ల పెంపుద్వారా వ‌చ్చిన ఆదాయం అక్ర‌మ సంపాద‌న అవుతుంద‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. ఈ ఆదాయాన్ని రిక‌వ‌రీ చేయాల‌ని అన్నారు. అత‌డి పిటిష‌న్‌పై విచార‌ణ‌ను చేప‌ట్టిన హైకోర్టు న‌లభై రెండు కోట్ల ఆదాయానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని జీఎస్‌టీ అధికారుల‌తో పాటు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. నిర్మాత‌లు, బుక్ మై షోతో పాటు ఇత‌ర ప్ర‌తివాదుల‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి త‌దుప‌రి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 3వ తేదీకి వాయిదా వేసింది.

90 రోజుల ముందే...

ఒక‌వేళ పిటిష‌న‌ర్‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తే న‌ల‌భై రెండు కోట్లు నిర్మాత‌లు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. ఈ పిటీష‌న్‌కు వ్య‌తిరేకంగా నిర్మాత‌ల‌కు కూడా కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు స‌మాచారం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు టికెట్ ధ‌ర‌ల పెంపును వ్య‌తిరేకిస్తూ విజ‌య్ గోపాల్ అనే సామాజిక వేత్త కూడా కోర్టులో కేసు వేశారు. ఇక నుంచి సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపుకు సంబంధించిన అనుమ‌తుల‌ను 90 రోజుల ముందే ఇవ్వాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు తీర్పుతో సినీ ప‌రిశ్ర‌మ‌లో గంద‌ర‌గోళం మొద‌లైంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement