Hey Balwanth Review | హే బల్‌వంత్ రివ్యూ – సుహాస్ తండ్రి బిజినెస్ ఏంటి? సినిమా నవ్వించిందా? లేదా?
సుహాస్, శివానీ నగరం హీరోహీరోయిన్లుగా నటించిన హే బల్‌వంత్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ ముంగిట సెన్సార్ ఇబ్బందులతో టైటిల్ మారిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 20, 2026, 8.49 am IST
Hey Balwanth Review | అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు తర్వాత సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన మూవీ హే బల్‌వంత్. కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీ అచ్చర దర్శకత్వం వహించాడు. నరేష్, వెన్నెలకిషోర్, స్రవంతి చొక్కారపు కీలక పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకోవడం, రిలీజ్‌కు వారం ముందు సెన్సార్ కారణంగా టైటిల్ మారడంతో ఈ చిన్న సినిమాపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది. శుక్రవారం రిలీజైన హే బల్‌వంత్ ఎలా ఉంది? సుహాస్, సీనియర్ నరేష్ ఆడియెన్స్‌ను నవ్వించారా లేదా అంటే?
బల్‌వంత్ బిజినెస్...
కృష్ణ (సుహాస్) ఎమ్‌బీఏ కంప్లీట్ చేస్తాడు. తండ్రి బల్‌వంత్ బిజినెస్‌ను టేకాప్ చేయాలన్నది అతడి చిన్ననాటి కల. తండ్రి మాత్రం వద్దని వారిస్తాడు. తాను చేసే బిజినెస్ గురించి కొడుకు దగ్గర దాస్తాడు బల్‌వంత్. ఓ ఎన్‌జీఓలో కన్సల్టెంట్‌గా చేరిన కృష్ణకు మిత్రతో (శివానీ నగరం) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అదే టైమ్‌తో బల్‌వంత్‌కు హార్ట్‌స్ట్రోక్ రావడంతో తండ్రి వ్యాపారాన్ని తాను నడిపించే టైమ్ వచ్చిందని కృష్ణ అనుకుంటాడు.
తండ్రి చేసే బిజినెస్ గురించి తెలిసి కృష్ణ షాకవుతాడు. ఆ బిజినెస్ అతడి ప్రేమకథకు ఎలా అడ్డంకిగా మారుతుంది? అసలు బల్‌వంత్ చేసే బిజినెస్ ఏమిటి? ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కలలు కంటున్న మిత్ర తండ్రి పీవీబీకి (హర్షవర్ధన్) బల్‌వంత్ వ్యాపారం వల్ల జరిగిన నష్టమేమిటి? కృష్ణ, మిత్ర ప్రేమకథలోకి డాక్టర్ యువన్, చంప, దుర్గారావు ఎలా వచ్చారన్నదే ఈ మూవీ కథ.
బోల్డ్ కాన్సెప్ట్...
బోల్డ్ అండ్ సెన్సిబుల్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ గోపీ హే బల్‌వంత్ కథను రాసుకున్నారు. ఇలాంటి సబ్జెక్ట్‌లను డీల్ చేయడం అంటే కత్తి మీద సామే. కథ రాసుకోవడంలో, కామెడీని పండించే విషయంలో ఏ మాత్రం హద్దు దాటినా అది బూతుగా మారిపోతుంది. ఆ లైన్ దాటకుండా ఆడియెన్స్‌ను నవ్వించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.
తండ్రీ కొడుకుల అనుబంధంతో..
హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూ సాగే కథలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ వృత్తిలో మహిళలు ఎదుర్కొనే సాదకబాధకాలు, ఛీత్కారాలనే చూపించారు. వాటికి భిన్నంగా తండ్రీకొడుకుల బంధంతో డిఫరెంట్‌గా డైరెక్టర్ హే బల్‌వంత్ కథను రాసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బల్‌వంత్ బిజినెస్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంటూ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆ వ్యాపారం ఏమిటన్నది సినిమా మొదలైన కొద్ది సేపటికే రివీలవుతుంది. తండ్రి బిజినెస్ గురించి తెలిసిన తర్వాత కృష్ణ ఎలా రియాక్ట్ అయ్యాడు? ప్రియురాలు మిత్రకు దాని గురించి తెలియకుండా అతడు పడే పాట్లతో ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సుహాస్, సుదర్శన్ కామెడీ ట్రాక్‌లు చాలా వరకు వర్కవుట్ అయ్యాయి. వెన్నెలకిషోర్ ఎపిసోడ్ హిలేరియస్‌గా నవ్విస్తుంది.
శ్రీను వైట్ల ఫార్ములా...
హీరోయిన్ తాత చావుకు కృష్ణ తండ్రి బిజినెస్‌కు లింక్ చేస్తూ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సెకండాఫ్ సాగుతుంది. శ్రీనువైట్ల ఫార్ములాను ఫాలో అవుతూ ఫన్ జనరేట్ చేశారు డైరెక్టర్. శవం చుట్టూ సాగే కన్ఫ్యూజన్ డ్రామా ఆకట్టుకుంటుంది. నవ్వించడమే పరమావధిగా సాగిన ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. విధిలేని పరిస్థితుల్లో తనకు ఇష్టంలేని వ్యాపారాన్ని ఓ తండ్రి ఎందుకు ఎంచుకోవాల్సివచ్చింది? తన కొడుకుకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం అతడు పడిన తపనను హృద్యంగా చూపించారు. కాకపోతే ఈ సీన్లు అంత కన్వీన్సింగ్‌గా రాసుకోలేకపోయాడు. కోర్ పాయింట్‌ను బలంగా చెప్పలేకపోయారు. సెకండాఫ్ ప్రెడిక్టబుల్‌గా సాగడం కూడా మైనస్‌గా మారింది.
సెటిల్డ్ కామెడీ...
కృష్ణ పాత్రలో సుహాస్ సెటిల్డ్ కామెడీతో ఆకట్టుకున్నాడు. నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్లలో తన నటనతో మెప్పించారు. బల్‌వంత్‌గా నరేష్ క్యారెక్టర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రీసెంట్ టైమ్స్‌లో నరేష్ చేసిన మరో మంచి క్యారెక్టర్ ఇది. కామెడీతో ఎంత నవ్వించాడో చివరలో సెంటిమెంట్‌తో అంతగా ఆకట్టుకున్నాడు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలను నరేష్ ఇమిటేట్ చేసే సీన్లు థియేటర్లలో విజిల్స్ బాగానే పడతాయి. సుదర్శన్, వెన్నెలకిషోర్ పోటీపడి కామెడీని పండించారు. సుదర్శన్ వేసే ప్రతి పంచ్ పేలింది. చంప అనే వేశ్య పాత్రలో యాంకర్ స్రవంతి యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది. శివానీ నగరం నాచురల్ నటించింది. వివేక్ సాగర్ బీజీఎమ్ బాగుంది.
హిలేరియస్ ఎంటర్‌టైనర్...
హే బల్‌వంత్ హిలేరియేస్ ఎంటర్‌టైనర్ మూవీ. నవ్విస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. అక్కడక్కడ వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కాస్తంత ఇబ్బందిపెడతాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



