Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు – పుష్పతో కంపేరిజన్స్ – ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
ప్యారడైజ్ సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్ వెనుక బలమైన ఎమోషనల్ ఉంటుందని హీరో నాని అన్నారు. ఈ సినిమాలోని రిస్కీ యాక్షన్ సీన్లలో డూప్‌లపై ఆధారడకుండా తానే స్వయంగా నటించినట్లు చెప్పారు. జడల్ పాత్ర లుక్ కోసం ప్రతి రోజు మేకప్ వేసుకోవడానికి గంటన్నర పట్టేదని నాని పేర్కొన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Entertainment | Published On Sep 20, 2026, 7.21 pm IST
Nani Interview | లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ కథలతో నాచురల్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు నాని. తన పంథాకు భిన్నంగా ప్యారడైజ్ మూవీతో ఫస్ట్ టైమ్ యాక్షన్ జానర్‌లో సినిమా చేయబోతున్నాడు నాని. ఈ పీరియాడికల్ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 24న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ప్యారడైజ్ రిలీజ్ సందర్భంగా నాని పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...
సెప్టెంబర్ సెంటిమెంట్...
యాక్టర్‌గా నా కెరీర్ స్టార్ట్ అయ్యిందే సెప్టెంబర్ లో. ‘అష్టా చమ్మా’ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా ఇదే నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హిట్ సెంటిమెంట్ ‘ప్యారడైజ్’కి వర్కవుట్‌అవుతుందని నమ్ముతున్నాను. కెరీర్‌లో ఇప్పటివరకు అన్ని రిలేటబుల్ రోల్స్ చేశా. ప్రతి ఆడియెన్ తమకు తెలిసిన ఒక పర్సన్ అని ఫీలయ్యే పాత్రల్లోనే కనిపించా. ఇందులోని జడల్ క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యూతో చూస్తారు. నిజానికి తెలుగులో ఇలాంటి పాత్రలతో సినిమా రాలేదు. యాక్షన్ ఎక్కువగా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. తల్లీకొడుకుల ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది.
అన్ని రకాల ఎమోషన్స్...
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా చేయాలంటే నటుడిగా నేను పెద్ద ఆసక్తి చూపించను. ఒక మంచి కథ చెప్పి అందులో యాక్షన్ ఉంటే ఇష్టపడతాను. ‘ప్యారడైజ్’ కథలోనే యాక్షన్ ఉంది. అందులో ప్రతి ఫైట్ సీన్ కూడా ఒక బలమైన ఎమోషన్‌తో మొదలవుతుంది.
డౌట్ ఉండేది...
శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్ బాబు విలన్ అయితే బాగుంటుంది అని అన్నాడు. కాకపోతే ఆయన ఈ క్యారెక్టర్ చేస్తారా లేదా అనేది డౌట్ వచ్చింది. చాలా క్రూరంగా ఉండే పాత్ర. శ్రీకాంత్ చెప్పిన కథ విని మోహన్‌బాబు ఎగ్జైట్‌గా ఫీలయ్యారు. ప్యారడైజ్ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు.
మస్తు ఉంటది
డైరెక్టర్ శ్రీకాంత్ దృష్టిలో నేను పెద్ద డ్యాన్సర్‌ని (నవ్వుతూ). నువ్వు డ్యాన్స్ చేస్తే మస్తు ఉంటది అని ఎప్పుడూ చెబుతుంటాడు. శ్రీకాంత్ కోసమే ఎలాగైనా ఈ సినిమాలో డ్యాన్స్ చేయాలనుకున్నాను. తన నమ్మకం నిజమైంది. పాటలు రిలీజ్ అయిన తర్వాత నా డ్యాన్స్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల’ కంటే ఇందులోని ‘అంజనా అంజనీ’ పాట అంటే నాకు ఇష్టం. రిలీజ్ కాలేదు. కానీ ఈ పాట నా కారులో నాన్‌స్టాప్‌గా ప్లే అవుతూనే ఉంటుంది.
ట్రైబ్స్ కథ...
‘ప్యారడైజ్’ అనే ప్లేస్‌లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథతో ఈ మూవీని డైరెక్టర్ శ్రీకాంత్ రూపొందించారు. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం ఓ వీరుడు చేసిన తిరుగుబాటు చుట్టూ ఈ కథ సాగుతుంది. 1984-85 టైమ్‌లైన్ మధ్య ఉంటుంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అక్కడ చూపించిన వరల్డ్‌కి మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉన్న ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది.
ఎంజాయ్ చేయలేను...
ప్యారడైజ్‌లోని యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా నేనే స్వయంగా నటించా.డూప్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేను. అది నా ప్రాబ్లం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ చెప్తాను సినిమాలో లెగ్ షాట్ అయినా, హ్యాండ్ కనిపించే షాట్ అయినా నేనే స్వయంగా చేస్తా. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ‘అబ్బా.. ఇది డూప్ షాట్’ అని అనిపిస్తే ఆ కాంప్లిమెంట్‌ను నేను జెన్యూన్‌గా తీసుకోలేను.
జడల్‌గా ...
సినిమాలో జడల్‌గా పాత్రలో నా లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ పాత్రకు సంబంధించి మేకప్ వేసుకోవడానికి ప్రతి రోజు నాకు గంట నలభై నిమిషాలు టైమ్ పట్టేది. మళ్లీ మేకప్ తీయడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. కొన్నిసార్లు ఏకధాటిగా 36 గంటల పాటు షూట్ చేశాం.
ప్యారడైజ్ పాటలు...
మా అబ్బాయి అర్జున్ ప్రస్తుతం ‘ప్యారడైజ్’ పాటలే వింటున్నాడు. వినాయక చవితికి ‘ఏషు నాగుల’ పాటకు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మా అమ్మకు యాక్షన్, వయలెంట్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. ‘జులాయి’ సినిమాలో లాగా కొంచెం పువ్వులు, అమ్మాయిలు స్టైల్‌లో హ్యాపీ సినిమాలు చేయమని చెప్తుంది (నవ్వుతూ).
‘పుష్ప’ డిలే
రిలీజ్ డిలే ఎఫెక్ట్ రిజల్ట్‌పై ఉండదని అనుకుంటున్నాను. సుకుమార్ గారికి ‘పుష్ప’ డిలే అయినంత మాత్రాన కెరీర్ ఎఫెక్ట్ అయిందా? క్వాలిటీ ప్రొడక్ట్ డెలివర్ చేయనప్పుడే కెరీర్ దెబ్బతింటుంది తప్ప, డిలే వల్ల కాదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంలో డిలే అయితే అది కెరీర్‌కి ఏం నష్టం ఉండదు. రిజల్ట్ మాత్రమే కెరీర్‌ని డిసైడ్ చేస్తుంది.
చేయడానికి కాదు...
ఇందులో యాక్షన్ చూడడానికి ఎంజాయ్‌గా ఉంటుంది కానీ చేయడానికి మాత్రం అంత ఎంజాయ్ కాదు (నవ్వుతూ). ప్రతి రోజు బురదో, వర్షమో ఏదో ఒక దాంట్లోకి తీసుకెళ్లి పడేసేవాడు శ్రీకాంత్. అది స్క్రీన్ మీద చూడండి బాగుంటుంది. కానీ చేయడానికి కాదు (నవ్వుతూ).
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
సెప్టెంబర్ 20, 2026

Shruti Sodhi | టాలీవుడ్ కమెడియన్‌తో పటాస్ హీరోయిన్ మూవీ – గుడ్‌బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
సెప్టెంబర్ 20, 2026

Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – “ఏ” సర్టిఫికెట్తో రిలీజ్
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?
- ●Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం



