త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Horror Movie | హెబ్బాప‌టేల్ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌

హెబ్బాప‌టేల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు హార‌ర్ మూవీ ఈషా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో త్రిగుణ్‌, అఖిల్ రాజ్‌, సిరి హ‌నుమంతు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

N

Entertainment | Published On Feb 20, 2026, 2.43 pm IST

Horror Movie | హెబ్బాప‌టేల్ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌
Advertisement

Horror Movie |  హెబ్బాప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ మూవీ ఈషా ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ తెలుగు మూవీలో త్రిగుణ్‌, అఖిల్ రాజ్‌, సిరి హ‌నుమంతు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీనివాస్ మ‌న్నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం (నేడు) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చింది.

డ‌బుల్ ప్రాఫిట్స్‌...

ప్యూర్ హార‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈషా సినిమాను టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కేఎల్ దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించారు. వంశీ నందిపాటి, బ‌న్నీవాసు రిలీజ్ చేశారు. కేవ‌లం మూడు కోట్ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన ఈషా ఆరు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు డ‌బుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది.

క్లైమాక్స్ ట్విస్ట్‌...

ఈషా మూవీలో హార‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్‌ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాకు ఈషా 2 పేరుతో సీక్వెల్ రాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈషా మూవీకి ధృవ‌న్ మ్యూజిక్ అందించారు.

ఆత్మ‌లు ఉన్నాయా?

క‌ళ్యాణ్ (త్రిగుణ్‌), విన‌య్ (అఖిల్ రాజ్‌), న‌య‌న (హెబ్బాప‌టేల్‌), అప‌ర్ణ (సిరి హ‌నుమంతు)చిన్న‌నాటి నుంచి స్నేహితులు. ఆత్మ‌లు ఉండ‌వ‌ని న‌మ్ముతుంటారు. దొంగ బాబాల నిజ‌స్వ‌రూపాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటారు.
ఆదేదేవ్ బాబా కూడా దొంగ స్వామిజీ అని నిరూపించాల‌ని అనుకుంటారు. స్వామిజీతో చేసిన ఛాలెంజ్ కార‌ణంగా మూడు రోజుల పాటు అదే ప్రాంతంలో ఉన్న పాడుబ‌డిన బంగ్లాలో ఉండ‌టానికి అంగీక‌రిస్తారు? అక్క‌డ వారికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? ఆ న‌లుగురు స్నేహితుల‌ను చంపాల‌ని ప్ర‌య‌త్నించిన పుణ్య‌వ‌తి ఎవ‌రు? బాబాతో చేసిన ఛాలెంజ్‌లో వారు గెలిచారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
ఈషాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత హెబ్బాప‌టేల్ తెలుగులో మంచి హిట్టు అందుకుంది. అలా ఎలా, కుమారి 21 ఎఫ్ స‌క్సెస్‌ల‌తో తెలుగులో హెబ్బాప‌టేల్‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. 30కిపైగానే తెలుగు సినిమాలు చేసింది. క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్ల కార‌ణంగా ఇందులో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

Advertisement
Advertisement