Raashi Khanna | కథ వినకుండా సెట్స్‌కు వచ్చేసింది – రాశీఖన్నాపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్…
ఉస్తాద్ భగత్‌సింగ్ కథ వినకుండానే రాశీఖన్నా ఈ సినిమాలో నటించిందని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ఈ సినిమా నుంచి కాలరే ఎత్తరా సాంగ్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో రాశీఖన్నా, హరీష్ శంకర్ ప ఆల్గొన్నారు. మార్చి 19న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Mar 12, 2026, 7.32 pm IST
Raashi Khanna | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి కాలరే ఎత్తరా అనే సాంగ్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు. దేశిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.కాలరే ఎత్తరా సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో జరిగింది. ఈ వేడుకలో రాశీఖన్నా తో పాటు దర్శకుడు హరీష్ శంకర్ పాల్గొన్నారు.
మాస్ సాంగ్‌లో...
ఈ వేడుకలో రాశీఖన్నా మాట్లాడుతూ..."పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక కెరీర్ ఆరంభం నుంచి ఉండేది. ఉస్తాద్ భగత్‌సింగ్‌తో ఆ కల నెరవేరింది. కాలరే ఎత్తరా మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు" అని రాశీఖన్నా అన్నది.
కథ వినకుండానే....
కథ వినకుండానే రాశీఖన్నా ఉస్తాద్ భగత్‌సింగ్‌లో నటించిందని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ కథ చెప్పడానికి రాశీఖన్నాకు ఫోన్ చేశాను. "జూమ్‌లో కథ చెప్పాలా...ఫోన్‌లోనే చెప్పాలా అని అడిగా...అవసరం లేదు...నేరుగా సెట్స్‌కు వచ్చేస్తా అని బదులిచ్చింది. కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ పాటలో కూడా కళ్యాణ్‌తో కలిసి రాశీఖన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయింది. 2000 మంది డ్యాన్సర్లతో కాలరే ఎత్తరా పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాం. మైత్రీ మూవీ మేకర్స్ కెరీర్‌లోనేఅత్యధిక వ్యయంతో ఆ సాంగ్ కోసమే ఓ సెట్ వేశారు. ఈ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో సెట్ మొత్తం దద్దరిల్లిపోయింది. సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో ఆయన అద్భుతంగా నటించారు" అని హరీష్ శంకర్ చెప్పాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశీఖన్నాతో పాటు శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్ అందిస్తోన్నారు.
సంబంధిత వార్తలు

Bhagyashri Borse | లవ్లెటర్కు భాగ్యశ్రీ బోర్సే క్రేజీ రియాక్షన్ – నెట్టింట వైరల్ అవుతోన్న పోస్ట్
ఏప్రిల్ 6, 2026

Varun Tej | అన్న హీరో – చెల్లి నిర్మాత – పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా మొదలైన వరుణ్ తేజ్ బరి
మార్చి 28, 2026

Sreeleela | ఫ్లాపుల్లో శ్రీలీల ట్రిపుల్ హ్యాట్రిక్ – ఉస్తాద్తోనూ తప్పని నిరాశ
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



