త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hansika | తెలుగులో రిలీజైన హ‌న్సిక త‌మిళ హార‌ర్ మూవీ – ఫ్రీగా చూసేయండి!

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ హార‌ర్ మూవీ గార్డియ‌న్ తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. గురుశ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను డైరెక్ట‌ర్ విజ‌య్ చంద‌ర్ నిర్మించారు.

N

Entertainment | Published On Feb 23, 2026, 12.20 pm IST

Hansika | తెలుగులో రిలీజైన హ‌న్సిక త‌మిళ హార‌ర్ మూవీ – ఫ్రీగా చూసేయండి!
Advertisement

Hansika | హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ గార్డియ‌న్ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌దీప్‌, సురేష్ చంద్ర‌మీన‌న్‌, శ్రీమాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌న్సిక‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజ్‌కు ముందు గార్డియ‌న్‌పై ఓ మోస్తారు అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఫ్రీ స్ట్రీమింగ్‌...

గార్డియ‌న్ అదే పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది. తాజాగా ఈ హార‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
హార‌ర్ అంశాల‌కు రివేంజ్ క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు గురు శ‌ర‌వ‌ణ‌న్ గార్డియ‌న్ మూవీని తెర‌కెక్కించారు. కోలీవుడ్ డైరెక్ట‌ర్ విజ‌య్ చంద‌ర్ ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. పుష్ప 2 ఫేమ్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.

అప‌ర్ణ క‌థ‌...

అప‌ర్ణ (హ‌న్సిక‌) త‌న‌ను తాను అన్‌ల‌క్కీగా భావిస్తుంటుంది. చిన్న‌ప్ప‌టి ప్ర‌తి విష‌యంలో ఆమెను దుర‌దృష్టం వెంటాడుతుంటుంది. ఆర్కిటెక్చ‌ర్ పూర్తిచేసిన అప‌ర్ణ ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అనుకోకుండా ఓ క్రిస్ట‌ల్ అప‌ర్ణ‌కు దొరుకుతుంది. అప్ప‌టి నుంచి ఆమె ఏది కోరుకుంటే అది జ‌రుగుతుంది. త‌న కంపెనీ బాస్ చ‌నిపోవాల‌ని అప‌ర్ణ అంటుంది. ఆమె క‌ళ్ల ముందే అత‌డు దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతాడు. అప్ప‌టినుంచే అప‌ర్ణ జీవితం చిక్కుల్లో ప‌డుతుంది. క్రిస్ట‌ల్ నుంచి బ‌య‌ట‌ప‌డిన ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. ఆ ఆత్మ ఎవ‌రు? అస‌లు మీరా ఎలా చ‌నిపోయింది? త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై అప‌ర్ణ స‌హాయంతో మీరా ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రీఎంట్రీకి రెడీ...

ఒక‌ప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగిన హ‌న్సిక చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమా లేదు. గార్డియ‌న్ త‌ర్వాత కొత్త సినిమా ఏది అంగీక‌రించ‌లేదు హ‌న్సిక‌. వ‌రుస ప‌రాజ‌యాల‌కు తోడు భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది హ‌న్సిక‌. త్వ‌ర‌లోనే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement