Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు – సీరియల్ నుంచి ఔట్ – రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!
గుండెనిండా గుడి గంటలు సీరియల్ నుంచి బాలు పాత్ర చేస్తోన్న విష్ణుకాంత్ వైదొలుగుతోన్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ 10లో ఆఫర్ రావడంతోనే విష్ణుకాంత్ ఈ సీరియల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. ఈ రూమర్లపై విష్ణుకాంత్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
Entertainment | Published On Aug 9, 2026, 2.55 pm IST
Bigg Boss | ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా గుండె నిండా గుడి గంటలు టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కార్తీక దీపం 2, ఇల్లు ఇల్లాలు పిల్లలు వంటి స్టార్ సీరియల్స్ డామినేషన్‌ను తట్టుకొని గుండె నిండా గుడి గంటలు నంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చింది. ఈ సీరియల్ సక్సెస్‌కు బాలు, మీనా పాత్రలు కీలకంగా నిలిచాయి. ఈ పాత్రల్లో వీరిద్దరి కెమిస్ట్రీ, చిలిపి గొడవలు, అల్లర్లు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే తీరు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మాస్ రోల్...
బాలుగా మాస్ రోల్‌లో విష్ణుకాంత్ నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతోన్నారు. తండ్రితో పాటు కుటుంబాన్ని అమితంగా ప్రేమించే మంచి మనసుకున్న కొడుకుగా, తన కళ్ల ముందు తప్పు జరిగితే సహించని రఫ్ అండ్ టఫ్ యువకుడిగా చక్కటి నటనతో విష్ణుకాంత్ బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్నాడు. విష్ణుకాంత్ అంటే ఎవరికి తెలియదు. కానీ బాలు అంటే మాత్రం ఇట్టే అతడిని గుర్తుపడతారు. అంతలా ఈ సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు.
బిగ్‌బాస్ ఆఫర్...
ఇటీవలే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏడు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. తాజాగా ఈ సీరియల్ ఫ్యాన్స్‌కు బాలు అలియాస్ విష్ణుకాంత్ పెద్ద షాకివ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గుండె నిండా గుడి గంటలు నుంచి అతడు తప్పుకోబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆఫర్ రావడంతో గుండె నిండా గుడి గుంటలు సీరియల్‌కు దూరం అవ్వాలని విష్ణుకాంత్ నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. భారీ రెమ్యూనరేషన్‌తో అతడు బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విష్ణుకాంత్ ప్లేస్‌లో ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ నిరంజన్ బాలు పాత్రలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. విష్ణుకాంత్ లేకుండా గుండె నిండా గుడి గంటలు చూడలేమంటూ, అతడు ఈ సీరియల్ నుంచి తప్పుకోవద్దంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
వీడియోతో క్లారిటీ...
ఎట్టకేలకు ఈ రూమర్లపై విష్ణుకాంత్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ వదిలేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లబోతున్నట్లు పోస్ట్‌లు, రీల్స్ కనిపిస్తున్నాయి. అది నిజమేననుకొని సీరియల్‌ను దూరం కావద్దు అంటూ చాలా మంది నాకు పర్సనల్ మెసేజ్‌లు పెడుతున్నారు. ఆ పాత్రలో మిమ్మల్ని తప్ప మరొకరిని చూడలేమని ప్రేమతో కామెంట్లు పెడుతున్నారు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు. బాలుగానే కొనసాగుతా. బాలుగానే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తా అని అన్నారు. విష్ణుకాంత్ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
;
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ – లాంఛ్ డేట్ … ఛానల్ ఇదే – టైటిల్ ఏంటంటే?
జులై 3, 2026

Gunde Ninda Gudi Gantalu Balu | స్టార్ మా కొత్త సీరియల్లో గుండె నిండా గుడి గంటలు బాలు – ఫుల్ లెంగ్త్ కాదు…గెస్ట్‌గా…
జనవరి 11, 2026

Telugu Serials | ఒకే రోజు రెండు తెలుగు సీరియల్స్ లాంఛ్ – ఒకటి స్టార్ మాలో…మరోటి జీ తెలుగులో..
డిసెంబర్ 22, 2025
తాజావార్తలు
- ●Ministers in Bonaalu Festival | ప్రజలందిరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఆయురారోగ్యాలతో మెలగాలని ప్రార్థించాం
- ●Trisha | అన్నతో విభేదాలు - తమ్ముడితో సినిమా - త్రిష నిర్ణయాలు ఊహాతీతం
- ●Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
- ●SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?
- ●Vijay Devarakonda | లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
- ●KTR | ఆదివాసీలు.. కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.. వారికి కేసీఆర్ ఎన్నో చేశారు

Ministers in Bonaalu Festival | ప్రజలందిరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఆయురారోగ్యాలతో మెలగాలని ప్రార్థించాం

Trisha | అన్నతో విభేదాలు - తమ్ముడితో సినిమా - త్రిష నిర్ణయాలు ఊహాతీతం

Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా

SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?



