త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jr Ntr | షూటింగ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాయించిన‌ గుణ‌శేఖ‌ర్ – అస‌లేమైందంటే?

చిన్న‌ప్పుడు సెట్స్‌లో ఎన్టీఆర్ బాగా అల్ల‌రి చేసేవాడ‌ని డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ అన్నారు. ఎన్టీఆర్ వ‌ల్ల బాల‌రామాయ‌ణం షూటింగ్ ఆగిపోయే ప‌రిస్థితి రావ‌డంతో ఓ రోజు ఆయ‌న్ని గ‌ట్టిగా తిట్టాన‌ని గుణ‌శేఖ‌ర్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On Jan 25, 2026, 4.59 pm IST

Jr Ntr | షూటింగ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాయించిన‌ గుణ‌శేఖ‌ర్ – అస‌లేమైందంటే?
Advertisement

Jr Ntr | గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాల‌రామాయ‌ణం మూవీతోనే ఎన్టీఆర్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. ఈ బాల‌ల మూవీలో రాముడిగా ఎన్టీఆర్ క‌నిపించారు. 1997లో రిలీజైన ఈ మూవీ నేష‌న‌ల్ అవార్డుతో పాటు నంది అవార్డుల‌ను అందుకుంది. బాల‌రాముడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. తాతకు త‌గ్గ మ‌న‌వ‌డిగా నిరూపించుకున్నారు.

షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌...

అయితే ఎన్టీఆర్‌తో బాల‌రామాయ‌ణం పూర్తిచేయ‌డానికి గుణ‌శేఖ‌ర్ చాలా క‌ష్టాలు ప‌డ్డార‌ట‌. అంద‌రూ చిన్న‌పిల్ల‌లే కావ‌డంతో షూటింగ్‌లో చెప్పిన మాట వినేవారు కాద‌ట‌. అంద‌రి కంటే ఎన్టీఆర్ అల్ల‌రి భ‌రించ‌డం క‌ష్ట‌మైంద‌ని గుణ‌శేఖ‌ర్ అన్నారు. యుఫోరియా ప్ర‌మోష‌న్స్‌లో బాల‌రామాయ‌ణం షూటింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌పై గుణ‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. "బాల‌రామాయ‌ణం షూటింగ్ టైమ్‌లో ఎన్టీఆర్ వ‌య‌సు 14 ఏళ్లే. అప్పుడు చాలా హైప‌ర్‌గా ఉండేవాడు. ఒక ద‌గ్గ‌ర కూర్చునేవాడు కాదు. నాకు రాముడు క్యారెక్ట‌ర్ వ‌ద్దు హ‌నుమంతుడి పాత్ర చేస్తాన‌ని ప్ర‌తి రోజు సెట్స్‌లో అల్ల‌రి చేసేవాడు. షూటింగ్‌లో శివ‌ధ‌నుస్సు విరిచే సీన్‌ను ఎన్టీఆర్‌తో ప్రాక్టిస్ చేయించాల‌నుకున్నాం. అస‌లైన సీన్ షూట్ చేయ‌డానికి ముందే శివ‌ధ‌నుస్సు విరిచేశాడు. ఎన్టీఆర్ వ‌ల్ల ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో కోపం ప‌ట్టంలేక‌పోయాను. ఎన్టీఆర్‌ను గ‌ట్టిగా వాయించాను" అని గుణ‌శేఖ‌ర్ అన్నారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ఒక్క మాట అనలేదు..

"నేను తిట్ట‌డంతో అమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు ఎన్టీఆర్‌. షాలిని గారు మాత్రం న‌న్ను ఒక్క మాట అన‌లేదు. ఎన్టీఆర్‌నే గ‌ట్టిగా తిట్ట‌డంతో మంద‌లించారు. డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్లు చేయాల్సిందేన‌ని కొడుకుకు స‌ర్ధిచెప్పారు. తిట్టినా కొట్టినా ప‌డాల‌ని చెప్పారు" అని గుణ‌శేఖ‌ర్ అన్నారు. చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎన్టీఆర్‌ను షాలిని పెంచార‌ని గుణ‌శేఖ‌ర్ చెప్పారు. ఎన్టీఆర్ కూడా అమ్మ మాట‌కు చాలా విలువ‌నిస్తార‌ని అన్నాడు. గుణ‌శేఖ‌ర్ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న యుఫోరియా మూవీ ఫిబ్ర‌వ‌రి 6న రిలీజ్ కాబోతుంది. భూమికా చావ్లా, సారా అర్జున్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.  గుణ‌శేఖ‌ర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement