Telugu OTT | ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – ఆటోడ్రైవర్‌తో ఇంజినీరింగ్ టాపర్ ప్రేమలో పడితే
లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ గోదారి గట్టుపైన థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
Entertainment | Published On May 29, 2026, 4.10 pm IST
Telugu OTT | సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ గోదారి గట్టుపైనా డీసెంట్ హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాగా మోస్తారు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా... సీనియర్ నాయకానాయికలు జగపతిబాబు, లైలా కీలక పాత్రల్లో నటించారు.
అమెజాన్ ప్రైమ్‌లో...
థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే గోదారి గట్టుపైనా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.
మేము ఫేమస్ తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ఇది. తొలి సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేయగా...గోదారి గట్టుపైన మూవీని ఆంధ్రా నేటివిటీతో రూపొందింది. తండ్రీకూతుళ్ల బంధానికి ప్రేమకథను జోడించి దర్శకుడు సుభాష్ చంద్ర ఈ సినిమాను రూపొందించారు. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు యాక్టింగ్, సుదర్శన్ కామెడీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రిలీజైన గోదారి గట్టుపైన ఎనిమిది కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. పెద్ద సినిమాలేవి పోటీగా లేకపోవడం, పాజిటివ్ టాక్ రావడం ఈ చిన్న సినిమాకు కలిసి వచ్చింది. ఈ సినిమాకు నాగవంశీ కృష్ణ మ్యూజిక్ అందించారు.
ఇంజినీరింగ్ టాపర్...
మాయ ఇంజినీరింగ్ స్టూడెంట్. చదువులో టాపర్. తండ్రి శ్యాంబాబు మాట జవదాటదు. కుటుంబం, చదువు లోకంగా బతుకుతుంది. రాజు ఓ ఆటోడ్రైవర్. కుటుంబ బాధ్యతల కారణంగా పదో తరగతిలోనే చదువు ఆపేస్తాడు. ఓ గొడవలో రాజుతో మాయకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి శ్యాంబాబు ఏం చేశాడు? మాయకు రాజును ఎలా దూరం చేశాడు? రాజు మంచితనం అతడి ప్రేమను ఎలా గెలిపించింది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం కామెడీ థ్రిల్లర్ మూవీ – ఆత్మలతో అంబులెన్స్ డ్రైవర్ ఫ్రెండ్షిప్
మే 28, 2026

Anaswara Rajan | టాలీవుడ్లో బిజీ అవుతోన్న మలయాళ బ్యూటీ – రొమాంటిక్ లవ్‌స్టోరీలో హీరోయిన్గా…
మే 24, 2026

NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
మే 20, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



