Netflix | ఘూస్కోర్ పండత్ వివాదం – టీజర్‌ను తొలగించిన నెట్‌ఫ్లిక్స్ – నీరజ్ పాండేపై కేసు నమోదు
బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ నీరజ్ పాండే రూపొందించిన ఘూస్కోర్ పండత్ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ టైటిల్ ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతోన్నాయి. నీరజ్ పాండేతో ఈ మూవీ డైరెక్టర్‌పై పోలీసు కేసు నమోదు అయ్యింది.
Entertainment | Published On Feb 7, 2026, 6.07 pm IST
Netflix | మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఘూస్కోర్ పండత్ మూవీ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్ క్రియేటర్ నీరజ్ పాండేతో పాటు నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ భోపాల్, ప్రయాగ్‌రాజ్‌తో పాటు పలు నగరాల్లో నీరజ్ పాండే దిష్ట బొమ్మను హిందూ సంఘాలు దహనం చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
షూస్కోర్ పండత్ పేరుతో నీరజ్ పాండే ఇటీవల ఓ సినిమాను ప్రకటించారు మనోజ్ బాజ్‌పాయ్, రిద్దిమా పండిత్, జోయా అఫ్రోజ్, దివ్యా దత్తా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నీరజ్ పాండే స్టోరీ రైటర్ కమ్ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓటీటీ మూవీకి రితేష్ షా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ రాబోతుంది. ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు.
లంచగొండి....
అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా పై హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. ముఖ్యంగా బ్రహ్మణ సంఘాల నుంచి టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పండత్ లేదా పండిట్ అని బ్రహ్మాణులను పిలుస్తుంటారు. ఘూస్కోర్ అంటే అవినీతిపరుడు, లంచగొండి అని అర్థం.
బ్రహ్మణులను అవినీతిపరులు అంటూ అవమానించేలా ఈ టైటిల్ ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఈ వెబ్ సిరీస్ వివాదం కాస్త రాజకీయ రంగు పలుముకుంది. బీఎస్‌పీ పార్టీ అధినేత మాయవతితో పాటు యూవీ డిప్యూటీ సీఏం బ్రజేష్ పాఠక్ లాంటి వారు సైతం ఘూస్కోర్ పండత్ మేకర్స్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేయడమే కాకుండా రిలీజ్ చేయద్దంటూ పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పినా...
ఈ సినిమాలో హిందూవులను మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి సన్నివేశాలు ఉండవంటూ నీరజ్ పాండే క్లారిటీ ఇచ్చారు. క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వివాదం సద్దుమణగలేదు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నీరజ్ పాండేతో పాటు డైరెక్టర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వివాదాల నేపథ్యంలో ఘూస్కోర్ పండత్ మూవీపై నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. ఈ సినిమా టీజర్‌తో పాటు ఇప్పటివరకు రిలీజ్ కంటెంట్ మొత్తాన్ని తొలగించింది. విమర్శల నేపథ్యంలో మూవీ టైటిల్ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



