Sharwanand | ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ – సంక్రాంతికి థియేటర్లలోకి జార్జ్ క్రిష్
టాలీవుడ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. జార్జ్ క్రిష్ సినిమాలో క్రిస్టియన్ యువకుడిగా, హిందూ అబ్బాయిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్లను పరిచయం చేస్తూ ఫస్ట్ బూస్టర్ పేరుతో మేకర్స్ ఓ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. సినిమా విడుదల తేదీని వెల్లడించారు.
Entertainment | Published On Sep 24, 2026, 6.05 pm IST
Sharwanand | కెరీర్‌లో ఫస్ట్ టైమ్ టాలీవుడ్ హీరో శర్వానంద్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అతడు హీరోగా సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో జార్జ్ క్రిష్ ఫేరుతో ఫన్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫస్ట్ బూస్టర్...
డైరెక్టర్ శ్రీనువైట్ల బర్త్‌డే సందర్భంగా జార్జ్ క్రిష్ ఫస్ట్ లుక్ వీడియోను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఫస్ట్ బూస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో క్రిస్టియన్ యువకుడు జార్జ్‌గా, హిందూ అబ్బాయి క్రిష్‌గా రెండు డిఫరెంట్ లుక్‌లలో శర్వానంద్ కనిపించాడు. ఈ పాత్రల మధ్య శర్వానంద్ చూపించిన వేరియేషన్స్, అతడి ఎక్స్‌ప్రెషన్స్ నవ్విస్తున్నాయి. ఇవి రెండు మాత్రమే కాకుండా మరో క్లాస్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. శ్రీనువైట్ల మార్కు కామెడీతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జార్జ్ క్రిష్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
రిలీజ్ డేట్ రివీల్....
జార్జ్ క్రిష్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారితో సంక్రాంతికి పెద్ద హిట్టును అందుకున్నాడు శర్వానంద్. మరోసారి పండుగ సెంటిమెంట్‌ను జార్జ్ క్రిష్‌తో రిపీట్ చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల, చిరంజీవి కాకాతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జార్జ్ క్రిష్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | దళపతి విజయ్ కొడుకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ – చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్
సెప్టెంబర్ 24, 2026

Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ – బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
సెప్టెంబర్ 24, 2026

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం
- ●KTR | సుప్రీం తీర్పు.. రాహుల్, రేవంత్‌కు చెంపపెట్టు : కేటీఆర్
- ●FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన..
- ●Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం
- ●Tollywood | చంపుతామంటూ బెదిరింపులు - శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ భార్య కంప్లైంట్
- ●Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?

Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం

KTR | సుప్రీం తీర్పు.. రాహుల్, రేవంత్‌కు చెంపపెట్టు : కేటీఆర్

FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన..

Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం



