Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన నాలుగు తెలుగు సినిమాలు – ఈ లవ్‌స్టోరీని మిస్సవ్వొద్దు…
శుక్రవారం ఒక్క రోజే ఓటీటీలో నాలుగు తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటుగా విడుదలైన ఆ సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Mar 13, 2026, 5.17 pm IST
Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో తెలుగు, తమిళం, మలయాళం భాషలకు చెందిన పలు సినిమాలు రిలీజయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే నాలుగు టాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన ఆ సినిమాలు ఏవంటే?
భర్త మహాశయులకు విజ్ఞప్తి...
రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయిన ఓ వ్యక్తి కథతో ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
కపుల్ ఫ్రెండ్లీ...
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సైలెంట్‌గా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిన్న సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.ఈ సినిమాతో అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఫంకీ...
విశ్వక్‌సేన్ లేటెస్ట్ మూవీ ఫంకీ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదలైంది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య ప్రేమకథతో డైరెక్టర్ కేవీ అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించారు. థియేటర్లలో ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. దిల్ రాజు, హరీష్ శంకర్‌తో పాటు నిర్మాత నాగవంశీ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
నవాబ్ కేఫ్...
శివకందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మూవీ నవాబ్ కేఫ్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించాడు. సెన్సార్ అభ్యంతరాల వల్ల రిలీజ్‌కు ముందు టైటిల్ మారడంతో ఆ ఎఫెక్ట్ రిజల్ట్‌పై పడింది.
తమిళ మలయాళ సినిమాలు కూడా...
తమిళ సినిమాలు మేడిన్ కొరియాతో (నెట్‌ఫ్లిక్స్) పాటు పూకి (జీ5), లాక్‌డౌన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)సినిమాలు కూడా తెలుగులో రిలీజయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మలయాళం మూవీ పెన్నుమ్ పోరాటం మలయాళంతో పాటు9 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



