త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Sipligunj | సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు న‌మోదు – బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ యువ‌తి ఫిర్యాదు

నాటునాటు సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్‌పై వైజాగ్‌లో బెదిరింపుల కేసు న‌మోదు అయ్యింది. రాహుల్ సింప్లిగంజ్ బావ‌మ‌రిది రాహుల్ రెడ్డి పెళ్లి పేరుతో త‌న‌ను మోసం చేశాడ‌ని ఓ యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. రాహుల్ సింప్లిగంజ్ త‌న‌ను బెదిరించాడంటూ ఈ కంప్లైంట్‌లో పేర్కొన్న‌ది.

N

Entertainment | Published On Aug 11, 2026, 11.12 am IST

Rahul Sipligunj | సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు న‌మోదు – బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ యువ‌తి ఫిర్యాదు
Advertisement

Rahul Sipligunj | నాటు నాటు సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్ చిక్కుల్లో ప‌డ్డాడు. వైజాగ్‌లో అత‌డిపై పోలీస్ కేసు న‌మోదు అయ్యింది. రాహుల్ సింప్లిగంజ్ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ ఓ యువ‌తి అత‌డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ సింప్లిగంజ్‌తో పాటు మ‌రో ప‌ద‌హారు మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

బావ‌మ‌రిది....

రాహుల్ సింప్లిగంజ్ బావ‌మ‌రిది క‌ర్పూర‌పు రాహుల్ రెడ్డి ప్రేమించాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి త‌న‌ను మోసం చేశాడ‌ని ఓ యువ‌తి ఆరోపించింది. ప‌ర్స‌న‌ల్ వీడియోలు తీసి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదుచేసింది. రాహుల్ రెడ్డి బంధువు అయిన రాహుల్ సింప్లిగంజ్ కూడా త‌న‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ ఆ యువ‌తి త‌న కంప్లైంట్‌లో పేర్కొన్న‌ది. త‌న‌తో త‌ప్పుడు వీడియో స్టేట్‌మెంట్స్ ఇప్పించార‌ని, త‌న ఫొటోలు, వీడియోల‌ను లీక్ చేసి గౌర‌వానికి భంగం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తించార‌ని అన్న‌ది.

ప‌ద‌హారు మందిపై.....

రాహుల్ సింప్లిగంజ్‌, రాహుల్ రెడ్డితో పాటు మ‌రో ప‌ద‌హారు మందిపై సైబ‌ర్ హ‌రాస్‌మెంట్‌, క్రైమ్ కేసులు పెట్టింది. యువ‌తి ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ హ‌రాస్‌మెంట్ కేసుపై రాహుల్ సింప్లిగంజ్ కుటుంబం రియాక్ట్ కాలేదు.

 

Advertisement
Advertisement