త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Filmfare Awards 2026 | ఫిలిం ఫేర్ అవార్డ్ నామినేష‌న్స్ – బెస్ట్ యాక్ట‌ర్ రేసులో ఎన్టీఆర్‌, బ‌న్నీ

ఫిలింఫేర్ అవార్డుల నామినేష‌న్స్ వెలువ‌డ్డాయి. ఈ సారి బెస్ట్ యాక్ట‌ర్ రేసులో ఎన్టీఆర్‌, బ‌న్నీ ఉన్నారు. బెస్ట్ మూవీ కోసం క‌ల్కి, ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు మ‌రో నాలుగు సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి.

N

Entertainment | Published On Feb 12, 2026, 12.03 pm IST

Filmfare Awards 2026 | ఫిలిం ఫేర్ అవార్డ్ నామినేష‌న్స్ – బెస్ట్ యాక్ట‌ర్ రేసులో ఎన్టీఆర్‌, బ‌న్నీ
Advertisement

Filmfare Awards 2026 | ఫిలింఫేర్ అవార్డుల నామినేష‌న్స్ వెల్ల‌డ‌య్యాయి. ఈ సారి అవార్డుల రేసులో టాలీవుడ్ నుంచి ప‌లువురు అగ్ర హీరోలు, ద‌ర్శ‌కులు నిలిచారు. ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల వేడుక‌ను ఫిబ్ర‌వ‌రి 21న ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమాల‌కు అవార్డుల‌ను అంద‌జేయ‌బోతున్నారు. 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక‌లో ప‌లువురు అగ్ర హీరోహీరోయిన్లు సంద‌డి చేయ‌బోతున్నారు.

ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ...

కాగా ఈ సారి ఫిలింఫేర్ పుర‌స్కారాల్లో బెస్ట్ యాక్ట‌ర్ రేసులో బ‌న్నీతో పాటు ఎన్టీఆర్ నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్‌, దేవ‌ర సినిమాతో ఎన్టీఆర్ అవార్డు కోసం పోటీప‌డ‌బోతున్నారు. వీరితో పాటు బెస్ట్ యాక్ట‌ర్ రేసులో దుల్క‌ర్ స‌ల్మాన్ (ల‌క్కీ భాస్క‌ర్‌), నాని (స‌రిపోదా శ‌నివారం), సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ (టిల్లు స్క్వేర్‌), తేజ స‌జ్జా (హ‌నుమాన్‌) ఉన్నారు.

ప్ర‌భాస్ క‌ల్కి....

బెస్ట్ మూవీ కోసం ఆరు సినిమాలు పోటీప‌డ‌నున్నాయి. ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీతో పాటు ల‌క్కీ భాస్క‌ర్‌, 35 చిన్న క‌థ కాదు, క‌మిటీ కుర్రాళ్లు, హ‌నుమాన్‌, పుష్ప 2 సినిమాలు పోటీలో ఉన్నాయి.

బెస్ట్ డైరెక్ట‌ర్‌...

బెస్ట్ డైరెక్ట‌ర్ అవార్డు కోసం...సుకుమార్ (పుష్ప 2), నంద‌కిషోర్ (35 చిన్న క‌థ కాదు), నాగ్ అశ్విన్ (క‌ల్కి 2898 ఏడీ), ప్ర‌శాంత్ వ‌ర్మ (హ‌నుమాన్‌), వెంకీ అట్లూరి (ల‌క్కీ భాస్క‌ర్‌, య‌దు వంశీ (క‌మిటీ కుర్రాళ్లు) రేసులో నిలిచారు.
బెస్ట్ హీరోయిన్ రేసులో ర‌ష్మిక మిన‌హా స్టార్ హీరోయిన్లు ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పుష్ప 2 సినిమాకుగాను ర‌ష్మిక అవార్డు కోసం పోటీప‌డ‌బోతుంది. ర‌ష్మిక‌తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (టిల్లు స్క్వేర్‌), ఆషికా రంగ‌నాథ్ (నా సామిరంగ ), మీనాక్షి చౌద‌రి (ల‌క్కీ భాస్క‌ర్‌), ప్రియాంక మోహ‌న్ (స‌రిపోదా శ‌నివారం), నివేథా థామ‌స్ ( 35 చిన్న క‌థ కాదు) ఉన్నారు. బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డు బ‌రిలో అమితాబ్ బ‌చ్చ‌న్ (క‌ల్కి 2989 ఏడీ), ఫ‌హాద్ ఫాజిల్ (పుష్ప 2 )తో పాటు ధ‌నంజ‌య్ (జీబ్రా), స‌త్య (మ‌త్తువ‌ద‌ల‌రా 2), ఎస్‌జే సూర్య (స‌రిపోదా శ‌నివారం ), విన‌య్ రాయ్ (హ‌నుమాన్‌) ఉండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement