త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fifa World Cup 2026 | ఎవరీ రజిత్ దేవ్? ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియ‌ల్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించిన‌ ఫస్ట్ ఇండియన్‌గా రికార్డ్‌!

2026 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ ఆరంభ వేడుక‌ల్లో ఇండియ‌న్ యాక్ట‌ర్ నోరా ఫ‌తేహి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. వ‌ర‌ల్డ్ క‌ప్ అషీషియ‌ల్ సాంగ్ సీర్ సీర్‌కు ఫ్రెంచ్ సింగ‌ర్ వెజెడ్రిమ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంజ‌య్‌ల‌తో క‌లిసి లైవ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. వ‌ర‌ల్డ్ క‌ప్ సాంగ్‌కు ఇండియ‌న్ డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌జిత్ దేవ్ కొరియోగ్ర‌ఫీ అందించ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Jun 13, 2026, 8.33 pm IST

Fifa World Cup 2026 | ఎవరీ రజిత్ దేవ్?  ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియ‌ల్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించిన‌ ఫస్ట్ ఇండియన్‌గా రికార్డ్‌!
Advertisement

Fifa World Cup 2026 |  కేర‌ళ‌కు చెందిన కొరియోగ్రాఫ‌ర్ ర‌జిత్‌దేవ్‌ చ‌రిత్ర‌ను సృష్టించారు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ అధికారిక గీతానికి డ్యాన్స్ కంపోజ్ చేసిన తొలి ఇండియ‌న్ కొరియోగ్రాఫ‌ర్ నిలిచాడు. 2026 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ ఆరంభ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. మొత్తం మూడు దేశాల్లో ఈ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించారు. కెన‌డాలో జ‌రిగిన వేడుక‌ల్లో బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌ అధికారిక గీతం సీర్ సీర్‌ లైవ్‌లో డ్యాన్స్ చేసింది. ఫ్రెంచ్ సింగ‌ర్ వెజెడ్రిమ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంజ‌య్‌తో క‌లిసి నోరా ఫ‌తేహి ఇచ్చిన ప‌ర్ఫార్మెన్స్ సెల‌బ్రేష‌న్స్‌కు హైలైట్‌గా నిలిచింది.

ఇండియ‌న్ కొరియోగ్రాఫ‌ర్‌...

సీర్ సీర్ సాంగ్‌ను లైవ్‌లో పాడుతూనే వంద‌లాది మంది డ్యాన్స‌ర్ల‌తో పాటు వెజెడ్రిమ్‌, సంజ‌య్‌ల‌తో క‌లిసి నోరా ఫ‌తేహి డ్యాన్స్ చేసింది. నోరా స్టెప్పుల‌కు దేశ‌విదేశీ ఆడియెన్లు సైతం ఫిదా అయ్యారు. ఈ స్టెప్పుల వెనుక ఇండియ‌న్ కొరియోగ్రాఫ‌ర్ ఉన్నాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ అఫీషియ‌ల్ సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసింది ఇండియ‌న్ డ్యాన్స్ మాస్ట‌ర్‌ ర‌జిత్ దేవ్‌.
ర‌జిత్ దేవ్ స్వ‌స్థ‌లం కేర‌ళ‌. కానీ ఈ కొరియోగ్రాఫ‌ర్ పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోన‌ట‌. చిన్న‌ప్పుడే డ్యాన్స్‌పై ఏర్ప‌డిన ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడ‌ట కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్‌తో పాటు టీవీ షోస్‌, సినిమాల‌కు కూడా ప‌నిచేశాడ‌ట‌.

మ‌లుపు తిప్పిన ప‌రిచ‌యం...

రియాలిటీ షో ఝ‌ల‌క్ థిక్లా జా ర‌జిత్ దేవ్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ షోలో కంటెస్టెంట్‌గా నోరా ఫ‌తేహి పాల్గొన్న‌ది. ఆ షోలోనే నోరాతో ర‌జిత్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. అప్ప‌టి నుంచి నోరా లైవ్ కాన్సెర్ట్‌ల‌కు ఇత‌డే కొరియోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తూ వ‌స్తున్నాడ‌ట‌.వ‌ర‌ల్డ్ క‌ప్ సాంగ్‌కు కూడా నోరా ఫ‌తేహి వ‌ల్లే ఛాన్స్ వ‌చ్చింద‌ని ర‌జిత్ చెప్పాడు.

ప‌దిహేను నిమిషాల్లోనే కంపోజింగ్‌...

నోరా ఫ‌తేహి చేసిన లైవ్ ప‌ర్ఫార్మెన్స్ సాంగ్‌ను మొరాకోలోని ఓ స్టూడియోలో షూట్ చేశార‌ట‌. ఈ లైవ్ డ్యాన్స్ కోసం ప‌దిహేను నిమిషాలు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారట నిర్వ‌హ‌కులు. దాంతో రిహ‌ర్స‌ల్స్‌, కెమెరా మూవ్‌మెంట్స్ అన్ని ముందుగానే రెడీ చేసుకొని పాట‌ను షూట్ చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింద‌ని అన్నారు. ఈ పాట రిహార్స‌ల్స్ కోసం కూడా త‌క్కువ టైమ్ దొరికింద‌ని చెప్పారు. కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ప్రాక్టీస్ చేశామ‌ని రజిత్ దేవ్ అన్నాడు.

సినిమాల్లో అవ‌కాశాలు...

సీర్ సీర్ సాంగ్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ర‌జిత్ దేవ్‌పై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కురుస్తోంది. ఇండియ‌న్ డ్యాన్స‌ర్‌కు ద‌క్కిన గౌర‌వ‌మిద‌ని, అవ‌కాశం ఇస్తే మ‌న క‌ళాకారులు కూడా ప్ర‌పంచ వేదిక‌పై స‌త్తాచాట‌గ‌ల‌ర‌ని నిరూపించాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌కు ర‌జిత్‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement