త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన జాతిర‌త్నాలు బ్యూటీ – ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా!

N

Entertainment | Published On Dec 5, 2025, 12.55 pm IST

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన జాతిర‌త్నాలు బ్యూటీ –  ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా!

ఫ‌రియా అబ్దుల్లా

Advertisement

జాతిర‌త్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ఈ హైద‌రాబాదీ బ్యూటీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ డైరెక్ట‌ర్‌గా సిగ్మా పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ తెర‌కెక్కుతోంది. అడ్వెంచ‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇప్ప‌టివ‌ర‌కు సిగ్మా మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ఫ‌రియా అబ్దుల్లా ఈ ఛాన్స్ ద‌క్కించుకుంది. జాస‌న్ సంజ‌య్ మూవీతోనే ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. త్వ‌ర‌లోనే ఫ‌రియా అబ్దుల్లా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
ఇందులో స‌రైనోడు ఫేమ్ కేథ‌రిన్ కూడా స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్‌ను ఓ భారీ సెట్ వేసి ఇటీవ‌ల సందీప్ కిష‌న్‌, కేథ‌రిన్‌ల‌పై షూట్ చేశార‌ట‌. ఈ ఐటెంసాంగ్‌తో సిగ్మా షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
జాస‌న్ విజ‌య్ డెబ్యూ మూవీ ఇదే కావ‌డంతో తెలుగుతో పాటు త‌మిళంలో ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. డైరెక్ట‌ర్‌గా తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా కోసం భారీగానే అత‌డు రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సిగ్మా మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కాగా జాతిర‌త్నాలు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫ‌రియా అబ్దుల్లా. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డంతో ఫ‌రియాకు బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి. రావ‌ణాసుర‌, లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్‌, ఆ ఒక్క‌టీ అడ‌క్కుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌భాస్ క‌ల్కిలో గెస్ట్ రోల్ చేసింది.
కాగా సిగ్మా కంటే ముందే ఫ‌రియా అబ్దుల్లా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. విజ‌య్ ఆంటోనీతో ఓ సినిమా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఓపెనింగ్ ఈవెంట్ త‌ర్వాత ఈ మూవీ ఆగిపోయింది

Advertisement

తాజావార్తలు

Advertisement