Sreeleela | టాలీవుడ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ను మిస్ చేసుకున్న శ్రీలీల – అసలేమైందంటే?
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ వంద కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించాల్సింది. తమిళ సినిమా పరాశక్తి తో డేట్స్ క్లాష్ కారణంగా అనగనగా ఒక రాజును మిస్ చేసుకుంది.
Entertainment | Published On Jan 20, 2026, 5.28 pm IST
Sreeleela | శ్రీలీల హిట్టు అందుకొని మూడేళ్లు దాటిపోయింది. అయినా ఈ అమ్మడి క్రేజ్‌కు డోకా లేదు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో ఆఫర్లు మీద ఆఫర్లు అందుకుంటోంది. ఇటీవలే పరాశక్తి మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రత్నమాల అనే అమ్మాయిగా శ్రీలీల కనిపించింది. ఈ తమిళ మూవీలో శ్రీలీల యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కమర్షియల్‌గా మాత్రం పరాశక్తి యావరేజ్‌గా నిలిచింది.
అనగనగా ఒక రాజులో హీరోయిన్‌గా
ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజైన నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజులో శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సింది. హీరోయిన్‌గా ఈ కన్నడ బ్యూటీ పేరును మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ డిలే అయ్యింది. అదే టైమ్‌లో పరాశక్తి , ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలతో బిజీ అయిన శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అనగనగా ఒక రాజు సినిమా నుంచి తప్పుకుంది. దాంతో మేకర్స్ ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపికచేశారు. ఈ సినిమాను రిజెక్ట్ చేసి శ్రీలీల పెద్ద తప్పు చేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
వంద కోట్ల కలెక్షన్స్
కాగా సంక్రాంతికి రిలీజైన పరాశక్తి ఇప్పటికీ యాభై కోట్ల మార్క్‌ను కూడా టచ్ చేయకపోగా అనగనగా ఒక రాజు మాత్రం వంద కోట్లకుపైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను రిజెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌ను మిస్ చేసుకుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల జడ్జిమెంట్ మరోసారి రాంగ్ అయ్యిందని అంటున్నారు.
పరాశక్తి డిజాస్టర్‌తో సంబంధం లేకుండా తమిళంలో మరో బంపర్ ఆఫర్ అందుకుంది శ్రీలీల. ప్రదీప్ రంగనాథన్ హీరోగా కోలీవుడ్‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3తో పాటు నాగ్జిల్లా సినిమాలు చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



