త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్‌ అంటూ మోసాలు – క్లారిటీ ఇచ్చిన టీమ్‌

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్‌లు ఇస్తామంటూ కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ట‌. ఈ ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై మూవీ క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోస‌పూరిత ప్ర‌క‌ట‌ను న‌మ్మ‌ద్ద‌ని, ఎవ‌రికి డ‌బ్బులు పంపొద్ద‌ని కోరింది.

N

Entertainment | Published On Jun 22, 2026, 3.26 pm IST

Tollywood | వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్‌ అంటూ మోసాలు – క్లారిటీ ఇచ్చిన టీమ్‌
Advertisement

Tollywood |  వెంక‌టేష్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీలో యాక్టింగ్ ఛాన్స్‌లు ఇస్తామంటూ కొంద‌రు మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ట‌. ఈ ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. "మా సినిమా పేరుతో ఒక న‌కిలీ కాస్టింగ్ కాల్ సోష‌ల్ మీడియాతో పాటు ఇత‌ర మాధ్య‌మాల ద్వారా ప్ర‌చారం అవుతోన్న‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది. ఆ కాస్టింగ్ కాల్‌కు మా చిత్ర యూనిట్‌కు ఎలాంటి సంబంధం లేదు. ద‌య‌చేసి అలాంటి మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దు. మా సినిమా త‌ర‌ఫున కాస్టింగ్ పేరుతో సంప్ర‌దిస్తున్న వ్య‌క్తుల‌కు మీ వివ‌రాలు, ఫొటోలు పంప‌వ‌ద్దు. డ‌బ్బులు ఇవ్వ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. మా సినిమాకు సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్ర‌క‌ట‌న‌లు ఉంటే అఫీషియ‌ల్ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్ల‌డిస్తాం. జాగ్ర‌త్త‌గా ఉండండి. మోస‌గాళ్ల బారిన ప‌డొద్దు "అంటూ ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది.

గ్రాండ్‌గా లాంఛ్

ఇటీవ‌లే వెంక‌టేష్, క‌ళ్యాణ్ రామ్‌ మ‌ల్టీస్టార‌ర్ మూవీ గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. సోమ‌వారం (నేటి) నుంచి ఈ మూవీ షూటింగ్ మొద‌లైంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న ఫ‌స్ట్ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్‌, కీర్తి సురేష్, కృతి శెట్టిల‌పై డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. మ‌రోవైపు ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌ల‌య్యాయి. ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు అనిల్ రావిపూడి ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement