Fahadh Faasil | పుష్ప విలన్‌తో రాజమౌళి కొడుకు తెలుగు హారర్ కామెడీ మూవీ – హీరోయిన్ లేకుండా ప్రయోగం
పుష్ప 2 తర్వాత మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తెలుగులో మరో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నాడు. అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి ప్రొడ్యూసర్లతో కలిసి రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది.
Entertainment | Published On Jul 13, 2026, 2.22 pm IST
Fahadh Faasil | అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప , పుష్ప 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన విలనిజంతో భయపెడుతూనే నవ్వించాడు. పుష్ప 2 తర్వాత తెలుగులో మరో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నాడు ఫహాద్ ఫాజిల్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. బాహుబలి ప్రొడ్యూసర్లు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలతో కలిసి రాజమౌళి తనయుడు కార్తికేయ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాను నిర్మిస్తున్నారు.
టీజర్ రిలీజ్...
హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో సూరి అనే మెజీషియన్‌గా ఫహాద్ ఫాజిల్ కామెడీ ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు టీజర్‌లో చూపించారు. ఓ చిన్నారి ముందు తనకొచ్చిన మ్యాజిక్స్ మొత్తం చేసిచూపిస్తాడు సూరి. చివరకు ఆ చిన్నారి ఓ దయ్యం అనే నిజం తెలుస్తుంది. ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి సూరి ఏం చేశాడు? ఓ అద్భుత దీపంలో ఆ చిన్నారి ఎందుకు దాక్కొన్నది అనే అంశాలతో టీజర్ ఫన్నీగా సాగింది. ఈ టీజర్‌కు తెలుగులో ఫహాద్ ఫాజిల్ సొంతంగా డబ్బింగ్ చెప్పాడు.
హీరోయిన్ లేకుండా....
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీలో అసలు హీరోయినే ఉండదని సమాచారం. కేవలం ఫహాద్ ఫాజిల్‌తో పాటు చిన్నారి దయ్యంగా నటిస్తోన్న సారా పాలేకర్ చుట్టూనే ఈ సినిమా కథ మొత్తం సాగుతుందని అంటున్నారు. హీరోయిన్ పాత్ర లేకుండా ఈ సినిమాతో మేకర్స్ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలిసింది.
సెప్టెంబర్‌లో రిలీజ్....
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు కాలభైరవ మ్యూజిక్ అందిస్తుండగా... రాజమౌళి భార్య రమా రాజమౌళి స్టైలిష్ట్‌గా పనిచేస్తున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కొడుకు అయిన శశాంక్ ఏలేటి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తోనే ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ – నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ – ప్రొడ్యూసర్‌గా హీరో నాని
జులై 11, 2026

Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ – దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
జులై 9, 2026

Sandeep Vanga | ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ – రోమాంచకం గ్లింప్స్ వచ్చేసింది
జులై 6, 2026
తాజావార్తలు
- ●Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
- ●Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ●Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన
- ●EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?
- ●Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు
- ●Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం

Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..

Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?



