Tamannaah | ప్రతి శుక్రవారం తలరాతలు మారిపోతుంటాయి – సినీ పరిశ్రమపై తమన్నా షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం నటీనటుల తలరాతలు మారుతూనే ఉంటాయని అన్నది మిల్కీ బ్యూటీ తమన్నా. శుక్రవారం వచ్చే రిజల్ట్‌లను బట్టే యాక్టర్లను ఆడియెన్స్ గౌరవించే విధానం కూడా మారిపోతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Entertainment | Published On Feb 24, 2026, 3.03 pm IST
Tamannaah | ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నది. అందంగా ఉన్నవాళ్లకే అవకాశాలు వస్తాయని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని అన్నది. ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది తమన్నా. దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కొన్నాళ్లుగా పరాజయాల కారణంగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయినా తమన్నా కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తన సినీ జర్నీపై ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఆసక్తికర కామెంట్లు చేసింది.
పదిహేనేళ్ల వయసులోనే...
"పదిహేనేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. తెలిసిన వాళ్లు ఎవరూ ఇండస్ట్రీలో లేరు. అంతా కొత్తే. వాటికి తోడు మొదట్లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అయినా వెనకడుగూ వేయలేదు. ప్రతి సినిమాకు నన్ను నేను కొత్తగా నిరూపించుకుంటూ ముందుకు సాగాను. పేరుప్రఖ్యాతులు, గుర్తింపు , సక్సెస్‌లు ఏవీ ఊరికే రాలేదు. వీటి వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. అందంగా ఉన్నాను కాబట్టే నాకు అవకాశాలు వస్తున్నాయనే తప్పుడు అభిప్రాయాలను పెట్టుకోలేదు. ఇండస్ట్రీలో నాకంటే అందంగా ఉన్న హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలు, పాత్రల వల్ల ప్రతిసారి నా విషయంలో ఆడియెన్స్ ఓ అంచనాకు వస్తుంటారు. వారు ఊహించినదానికంటే భిన్నంగా ప్రతిసారి కొత్తగా చేయడానికే ప్రయత్నిస్తుంటాను. ఆ సిద్ధాంతం వల్లే ఇన్నేళ్లు అయినా ఇండస్ట్రీలో ఉండగలిగాను" అని తమన్నా అన్నది.
ప్రతి శుక్రవారం...
"ఇండస్ట్రీలో ఎన్నేళ్లుగా ఉన్నాము, ఎన్ని గొప్ప సినిమాలు చేశామన్నది ముఖ్యంగా కాదు. అహంకారం, గర్వం లేకుండా వినయంతో ఉండటం అవసరం. ప్రతి శుక్రవారం నటీనటుల తలరాతలు మారుతూనే ఉంటాయి. ఆ రోజు వచ్చే రిజల్ట్‌లను బట్టే ఆడియెన్స్ యాక్టర్లను గౌరవించే విధానం మారిపోతుంటుంది. ఆ సత్యాన్ని ఎప్పుడూ మైండ్‌లో పెట్టుకొనే ఉంటానని" తమన్నా అన్నది.
ఇటీవలే ఓ రోమియో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తమన్నా. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్పెషల్ రోల్ చేసింది. ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో పురుషన్ అనే సినిమా చేస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొగుడు పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



