prabhakar | నా పెంపకాన్ని తప్పుపట్టొద్దు – చంద్రహాస్ బూతుసాంగ్ వివాదంపై క్షమాపణలు చెప్పిన ప్రభాకర్
చంద్రహాస్ చేసిన ఒక్క తప్పుతో తన పెంపకాన్ని, సంస్కారాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని బుల్లితెర నటుడు ప్రభాకర్ అన్నాడు. చంద్రహాస్ మాటల వల్ల ఇబ్బంది పడ్డ వారందరికి తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రభాకర్ చెప్పారు. చంద్రహాస్ బూతు సాంగ్‌పై రియాక్ట్ అయిన ప్రభాకర్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Feb 7, 2026, 7.41 pm IST
prabhakar |బూతు సాంగ్ వివాదంపై చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ రియాక్ట్ అయ్యాడు. తన పెంపకాన్ని, సంస్కారాన్ని ఒక్క తప్పుతో నిర్ణయించవద్దని అన్నారు. ఆ రోజు జరిగిన ఫంక్షన్‌లో నా భార్య, కూతురు లేరని, వారిని కించపరుస్తూ నానా మాటలు అంటున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ వేడుకలో స్టేజ్‌పై గుంజి గుంజి అనే పాటను చంద్రహాస్ పాడాడు. ఈ పాటలో అతడు వాడిన బూతులు, పదజాలంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్‌గా బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని, ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారాల్సిన పనిలేదంటూ చంద్రహాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా చంద్రహాస్‌పై పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.
వీడియో ద్వారా....
ఈ వివాదంపై చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఓ వీడియోను రిలీజ్ చేశాడు. "చంద్రహాస్ వాడిన బూతు పదాలు, వాటి మీద విశ్లేషణలు, అభిప్రాయాలు. వాళ్లు తిరిగి బూతులు మాట్లాడటాలు...గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. పబ్లిక్‌గా బూతులు మాట్లాడటం తప్పే. దానిని నేను ఎంకరేజ్ చేయను. పాట పాడిన తర్వాత చంద్రహాస్‌ను మందలించా. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయనని నాతో అన్నాడు. తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం సమంజసమే. కానీ ఆ తప్పును ఎత్తి చూపే ప్రయత్నంలో ఇంకో తప్పు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చంద్రహాస్ రెండు బూతులు మాట్లాడితే...వాటిపై విశ్లేషణల పేరుతో చాలా మంది వందల బూతులు మాట్లాడుతున్నారు" అని ప్రభాకర్ అన్నారు.
క్షమాపణలు చెబుతున్నా...
"ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నా భార్య తో పాటు కూతురు రాలేదు. . ఆ విషయం తెలియకుండా వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. పిల్లలను పెంచడం రాదా...పద్దతి తెలియదా అంటూ నన్ను నానా మాటలుఅంటున్నారు.
నా సంస్కారాన్ని, పెంపకాన్ని ఒక్క తప్పుతో డిసైడ్ చేయద్దు. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఇబ్బంది పడిన అందరికి క్షమాపణలు చెబుతున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాపై గౌరవంతో జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్, జయంత్ సీ పరాన్జీ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. నా వల్ల వారు మాటలు పడుతున్నారు. అందరిని మన్నించమని కోరుతున్నా" అని ప్రభాకర్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | ఓటీటీలో ఆటిట్యూడ్ స్టార్ మూవీ ట్రెండింగ్ – కులాల గొడవలపై సందేశం
మే 9, 2026

Divija Prabhakar | హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు – పల్లెటూరి ప్రేమకథలో…
ఫిబ్రవరి 8, 2026

Chandrahas | నా సినిమాను ఆడియెన్స్ చూడరనుకున్నా – కన్నీళ్లు పెట్టుకున్న చంద్రహాస్
ఫిబ్రవరి 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



