త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలో ఆటిట్యూడ్ స్టార్ మూవీ ట్రెండింగ్ – కులాల గొడ‌వ‌ల‌పై సందేశం

ఆటిట్యూడ్ స్టార్ చంద్ర‌హాస్ హీరోగా న టించిన బ‌రాబ‌ర్ ప్రేమిస్తా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మేఘ‌న‌ ముఖ‌ర్జీ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు సంప‌త్ రుద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా బ‌రాబ‌ర్ ప్రేమిస్తా కొన‌సాగుతోన్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

N

Entertainment | Published On May 9, 2026, 8.37 pm IST

OTT | ఓటీటీలో ఆటిట్యూడ్ స్టార్ మూవీ ట్రెండింగ్ – కులాల గొడ‌వ‌ల‌పై సందేశం
Advertisement

OTT |  ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా న‌టించిన బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీ ఇటీవ‌లే సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. విలేజ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు సంప‌త్ రుద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ మేఘ‌న ముఖ‌ర్జీ హీరోయిన్‌గా న‌టించింది.

అమెజాన్ ప్రైమ్‌లో...

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీ ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో టాప్ టెన్ తెలుగు ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా ఈ సినిమా కొన‌సాగుతోంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. కులాల గొడ‌వ‌లు, ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

డిజాస్ట‌ర్‌...

రిలీజ్ టైమ్‌లో బూతు పాట వివాదం కార‌ణంగా బ‌రాబ‌ర్ ప్రేమిస్తా పేరు బాగానే వినిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్ర‌హాస్ పాడిన ఓ పాట‌కు సంబంధించి అత‌డిపై విమ‌ర్శ‌లు రావ‌డ‌మే కాకుండా పోలీస్ కేసు కూడా న‌మోదు అయ్యింది. నెగెటివ్ ప్ర‌మోష‌న్‌తో సినిమాపై మంచి బ‌జ్ వ‌చ్చినా క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో బ‌రాబ‌ర్ ప్రేమిస్తా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆర్ ఆర్ ధ్రువ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ధ‌ర్మ‌న వ‌ర్సెస్ క‌ర్మ‌న‌...

రుద్రారం గ్రామంలో ధ‌ర్మ‌న‌, క‌ర్మ‌న వ‌ర్గాల మ‌ధ్య ఎప్పుడూ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ధ‌ర్మ‌న వ‌ర్గానికి చెందిన చందు...క‌ర్మ‌న అమ్మాయి బుజ్జ‌మ్మ‌తో ప్రేమ‌లో ప‌డ‌తారు. పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. వారి పెళ్లి వ‌ల్ల ఊళ్లో ఎలాంటి గొడ‌వ‌లు జ‌రిగాయి? ఆ ఊరిలో మార్పు కోసం చందు, బుజ్జ‌మ్మ ఎలాంటి నాట‌కం ఆడారు అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.
బుల్లితెర ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిగా రామ్ న‌గ‌ర్ బ‌న్నీతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చంద్ర‌హాస్‌. బ‌రాబ‌ర్ ప్రేమిస్తా హీరోగా అత‌డి సెకండ్ మూవీ.

 

Advertisement
Advertisement