Chandrahas | నా సినిమాను ఆడియెన్స్ చూడరనుకున్నా – కన్నీళ్లు పెట్టుకున్న చంద్రహాస్
యాటిట్యూబ్ స్టార్ చంద్రహాస్ ఎమోషనల్ అయ్యాడు. బూతు సాంగ్ వివాదం కారణంగా తన సినిమాను చూడటానికి ఆడియెన్స్ థియేటర్లకు రారని అనుకున్నానని అన్నాడు. తన వల్ల సినిమాకు ఇబ్బంది కాకూడదని కోరుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Entertainment | Published On Feb 7, 2026, 5.03 pm IST
Chandrahas | యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎమోషనల్ అయ్యాడు. ఇటీవల నెలకొన్న వివాదం కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. బుల్లితెర ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై చంద్రహాస్ ఓ పాట పాడాడు. గుంజి గుంజి అంటూ సాగిన ఈ పాట వివాదానికి దారితీసింది. ఈ పాటలో చంద్రహాస్ వాడిన పదజాలం, బూతులపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బూతు పాటకు సంబంధించి చంద్రహాస్‌పై పోలీసు కేసు నమోదు అయ్యింది. చివరకు ఈ సాంగ్‌తో తమకు సంబంధం లేదంటూ దర్శకనిర్మాతలు స్వయంగా ప్రకటించారు.
కన్నీళ్లు....
ఈ వివాదంతో సంబంధం లేకుండా బరాబర్ ప్రేమిస్తా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులతో కలిసి చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన సినిమా చూడటానికి ఆడియెన్స్ థియేటర్లకు రారని అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంతమందికి నచ్చుతుందనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ పాట పాడాను. కానీ అదే సినిమాపై ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందోనని భయపడ్డాను. నా వల్ల సినిమాకు ఇబ్బంది కాకూడదనే కోరుకున్నాను అని చంద్రహాస్ పేర్కొన్నాడు. చంద్రహాస్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండో సినిమా....
సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన బరాబర్ ప్రేమిస్తా మూవీలో మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. బరాబర్ ప్రేమిస్తా హీరోగా చంద్రహాస్‌కు సెకండ్ మూవీ. రామ్‌నగర్ బన్నీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రామ్ నగర్ బన్నీ సినిమాకు చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ స్వయంగా ప్రొడ్యూస్ చేశారు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



