త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadi Sai Kumar | ఈగో రాజాగా ఆది సాయిక‌మార్ – హీరోగా తొలి త‌మిళ మూవీ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కోలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ఈగో రాజా పేరుతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Mar 19, 2026, 3.49 pm IST

Aadi Sai Kumar | ఈగో రాజాగా ఆది సాయిక‌మార్ – హీరోగా తొలి త‌మిళ మూవీ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌
Advertisement

Aadi Sai Kumar |  శంబాల మూవీతో కెరీర్‌లోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ 20 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత క‌థ‌ల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోన్నాడు ఆది సాయికుమార్‌. తాజాగా హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఈగోరాజా అనే పేరును ఖ‌రారు చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు గురు శరవణన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క‌మెడియ‌న్ స‌తీష్‌...

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె. ఎస్. రవికుమార్ వద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేసిన‌ గురు శరవణన్ ‘కూగల్ కుట్టప్ప’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ‘ఈగో రాజా’ అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మూడో సినిమా. కోలీవుడ్ క‌మెడియ‌న్ స‌తీష్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

షూటింగ్ ఎండింగ్‌...

ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈగో రాజా మూవీకి మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోండ‌గా...గిబ్రాన్ మ్యూజిక్ స‌మ‌కూర్చుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీని సంబంధించిన మ‌రిన్ని అప్‌డేట్స్ వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ అన్నారు. ప్ర‌స్తుతం ఈగోరాజా తో పాటు ఇన్స్‌పెక్ట‌ర్ యుగంధ‌ర్ సినిమా చేస్తోన్నాడు ఆది సాయికుమార్‌. ఈ మూవీ వేస‌విలో రిలీజ్ కాబోతుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement