త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eesha Rebba | అందుకే ఆఫ‌ర్లు రావ‌డం లేదు – ఈషా రెబ్బా కామెంట్స్ వైర‌ల్‌

తెలుగు అమ్మాయిని కావ‌డం వ‌రంతో పాటు శాపంగా మారింద‌ని ఈషారెబ్బా అన్న‌ది. ట్రెడిష‌న‌ల్ రోల్స్‌కే డైరెక్ట‌ర్లు త‌న‌ను ప‌రిమితం చేశార‌ని చెప్పింది. గ్లామ‌ర్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని తెలిపింది.

N

Entertainment | Published On Apr 13, 2026, 2.28 pm IST

Eesha Rebba | అందుకే ఆఫ‌ర్లు రావ‌డం లేదు – ఈషా రెబ్బా  కామెంట్స్ వైర‌ల్‌
Advertisement

Eesha Rebba |  తెలుగు అమ్మాయిని కావ‌డంతోనే ట్రెడిష‌న‌ల్ రోల్స్‌కు మాత్ర‌మే స‌రిపోతాన‌నే ముద్ర త‌న‌పై వేశార‌ని, స్టీరియోటైప్ పాత్ర‌ల‌కు త‌న‌ను ప‌రిమితం చేశార‌ని అన్న‌ది ఈషా రెబ్బా. అంత‌కుముందు ఆ త‌రువాత సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈషారెబ్బా. అమీతుమీ, అ!, రాగ‌ల ఇర‌వై నాలుగు గంట‌ల్లో, మామా మ‌శ్చీంద్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లే ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ఈషారెబ్బా. ఈ సినిమాలో గృహ హింస‌ను ఎదురించే మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌తిగా ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించింది. ఈషా రెబ్బా న‌ట‌న‌కు పేరొచ్చిన సినిమా మాత్రం ప‌రాజ‌యం పాలైంది.

ప‌దిహేను సినిమాలే...

ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన 13 ఏళ్ల‌లో కేవ‌లం ప‌దిహేను సినిమాలు మాత్ర‌మే చేసింది. తెలుగు అమ్మాయిని కావ‌డం వ‌ల్లే ఈషారెబ్బాకు ఎక్కువ‌గా అవ‌కాశాలు రావ‌డం లేదంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంపై ఈ బ్యూటీ రియాక్ట్ అయ్యింది.

వ‌రం...శాపం...

"తెలుగు అమ్మాయిని కావ‌డం ఓ ర‌కంగా వ‌రంతో పాటు శాపంగా మారింది. ప‌దిహేను సినిమాల్లో ఎక్కువ‌గా ప‌ల్లెటూరి యువ‌తిగానే క‌నిపించా. తెలుగు అమ్మాయిని కావ‌డంతో అలాంటి పాత్ర‌ల‌కు మాత్ర‌మే స‌రిపోతాన‌నే అపోహ చాలా మంది ద‌ర్శ‌కుల్లో ఏర్ప‌డింది. ఈ స్టీరియో టైప్‌ను బ్రేక్ చేస్తూ గ్లామ‌ర్ రోల్స్ కూడా చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకోవాల‌ని ఉంది. అందుకే సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా హాట్ ఫొటోల‌ను పోస్ట్‌చేస్తున్నాను. క‌నీసం వాటి ద్వారానైనా నాలోని గ్లామ‌ర్ కోణాన్ని చాటుకునే అవ‌కాశం దొరుకుతుంది. నాపై ఉన్న ముద్ర తొల‌గిపోతుంద‌ని అనుకుంటున్నా" అని ఈషా రెబ్బా అన్న‌ది.

ఓటీటీ ట్రెండ్...

"ప‌ర‌భాష హీరోయిన్ల‌తో పోలిస్తే తెలుగు అమ్మాయిలు న‌ట‌న‌తో పాటు ఎందులోనూ తీసిపోరు. ఓటీటీ ట్రెండ్ మొద‌లైన త‌ర్వాత తెలుగు నాయిక‌ల‌కు అవ‌కాశాలు పెరిగాయి. నార్త్ హీరోయిన్ల‌తో మ‌న‌వాళ్లు పోటీప‌డుతుండ‌టం ఆనందంగా ఉంది. కోలీవుడ్‌, మ‌ల‌యాళంలో సొంత భాష నాయిక‌ల‌ను ప్రోత్స‌హించే ధోర‌ణి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మ‌న ద‌గ్గ‌ర మాత్రం అలాంటి సంస్కృతి త‌క్కువే" అని ఈషా రెబ్బా అన్న‌ది.
ప్ర‌స్తుతం తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది ఈషారెబ్బా. రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Advertisement
Advertisement