Shruti Haasan | బోల్డ్ పాత్రలో శృతి హాసన్ – థియేటర్లలోకి టాలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ
సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతుంది. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ బోల్డ్ పాత్రలో కనిపించబోతుంది.
Entertainment | Published On Sep 17, 2026, 1.55 pm IST
Shruti Haasan |మూడేళ్ల తర్వాత బోల్డ్ రోల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శృతి హాసన్. సీతారామం , లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆస్ట్రోనాట్...
ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువతి కలను నెరవేర్చే క్రమంలో ఆమెను ప్రాణంగా ప్రేమించిన యువకుడికి ఎదురయ్యే పరిణామాలతో ఎమోషనల్ లవ్ డ్రామాగా ఆకాశంలో ఒక తార మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ గురువారం ఫైనల్ చేశారు. నవంబర్ 20 థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
లైంగిక వేధింపుల కేసు...
ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఆకాశంలో ఒక తార డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనను డైరెక్టర్ పవన్ సాధినేని లైంగికంగా వాడుకున్నాడంటూ ఓ తెలుగు నటి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పవన్ సాధినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్‌పై రిలీజయ్యాడు.
పుల్‌స్టాప్...
ఈ పోలీస్ కేసు కారణంగా సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమా నుంచి హీరో దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్లకు గురువారం నాటి పోస్టర్‌తో మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టాడు. ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు సమాచారం.
మూడేళ్ల తర్వాత...
చివరగా తెలుగులో ప్రభాస్ సలార్ సినిమా చేసింది శృతి హాసన్. ఆకాశంలో ఒక తారతో మూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●1 Crore Corpus | 40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?
- ●Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్
- ●Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ షురూ
- ●PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది : ప్రధాని మోదీ
- ●Theenmar Mallanna | బీసీల రాజ్యాధికారం కోసం మల్లన్న తొలి అడుగు.. గోల్కొండ కోట నుంచి రాజ్యాధికార యాత్ర షురూ
- ●Mallu Ravi Press Meet | యూపీఐ ట్యాక్స్ కాదు.. అది పూర్తిగా మోదీ ట్యాక్స్

1 Crore Corpus | 40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?

Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్

Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ షురూ

PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది : ప్రధాని మోదీ






