Meena | ఒంటరిగా ఉంటున్నాననే రూమర్లు క్రియేట్ చేస్తున్నారు – రెండోపెళ్లిపై దృశ్యం హీరోయిన్ రియాక్షన్
రెండో పెళ్లి గురించి వస్తోన్న పుకార్లపై సీనియర్ హీరోయిన్ మీనా రియాక్ట్ అయ్యింది. తాను ఒంటరి ఆడదానిని కావడంతోనే కొందరు ఈ రూమర్లను క్రియేట్ చేస్తున్నారని అన్నది. ఈ అసత్యపు వార్తల వల్ల చాలా కాలంగా మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పింది.
Entertainment | Published On Feb 20, 2026, 4.16 pm IST
Meena | టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై మీనా ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండటంతో అంతా నిజమేనని అనుకున్నారు. ఎట్టకేలకు సెకండ్ మ్యారేజీ వార్తలపై మీనా రియాక్ట్ అయ్యింది. ఒంటరి ఆడదానిననే తనపై లేనిపోని కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదనకు లోనయ్యింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లి పై మీనా రియాక్ట్ అయ్యింది. ఈ పుకార్లు తనను కలిచివేస్తున్నాయని, వాటి వల్ల గత కొద్ది నెలలుగా ఎంతో మనోవేదనకు గురవుతున్నానని మీనా అన్నది.
సెలిబ్రిటీనే
"నేను సెలిబ్రిటీనే...పైగా ఆడదానిని. అందులోనూ ఒంటరిగా ఉండటాన్ని అలుసుగా తీసుకుంటూ నా వ్యక్తిగత జీవితం గురించి లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. నిజానిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఏవేవో రాస్తున్నారు. అబద్దాలు అని తెలిసినా కూడా ఏం రాసిన, మాట్లాడిన చెల్లుబాటు అవుతుందని, అడిగేవారు ఎవరూ లేరనే ధైర్యంతోనే ఇలాంటి రూమర్లను కొందరు సృష్టిస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే కోపంతో పాటు అసహ్యం కలుగుతోంది. కానీ అనవసరపు విషయాల కోసం నా ఎనర్జీని, టైమ్‌ను కేటాయించడం వేస్ట్ అనే పట్టించుకోవడం మానేశాను. వాస్తవాలేమిటో కుటుంబసభ్యులకు, నన్ను ప్రేమించే వారికి తెలుసు. వాటిపై ఎవరికి క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదని" మీనా అన్నది. మీనా కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
దృశ్యం 3లో హీరోయిన్...
మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో 2022లో కన్నుమూశారు. మీనాకు కూతురు నైనిక ఉంది. ఇటీవల నైనికతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం మలయాళం మూవీ దృశ్యం 3 హీరోయిన్‌గా నటిస్తోంది మీనా. మోహన్‌లాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుంది.దృశ్యం 3 తెలుగు వెర్షన్‌లో మీనా హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ హీరోగా నటించనున్న ఈ మూవీ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన మూడు మలయాళ సినిమాలు
ఏప్రిల్ 20, 2026

Mohan Lal | ఓటీటీలో పెద్ద హిట్ – థియేటర్లలో ఎపిక్ డిజాస్టర్ – మోహన్‌లాల్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్
ఏప్రిల్ 14, 2026

Drishyam 3 | మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ …. దృశ్యం 3 పోస్ట్‌పోన్
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



