త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఒకే రోజు ఆరు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న మ‌ల‌యాళం మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్‌

మ‌ల‌యాళం మూవీ డోస్ ఒకే సారి ఆరు ఓటీటీల‌లో రిలీజ్ కాబోతుంది. మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సైజు విల్స‌న్‌, అశ్విన్ కుమార్‌, దృశ్య ర‌ఘునాథ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

N

Entertainment | Published On Jul 4, 2026, 7.56 pm IST

Malayalam OTT | ఒకే రోజు ఆరు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న మ‌ల‌యాళం మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్‌
Advertisement

Malayalam OTT |  మ‌ల‌యాళం మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ డోస్ ఒకే రోజు ఆరు ఓటీటీల‌లో రిలీజ్ కాబోతుంది. సైజు విల్స‌న్‌, అశ్విన్ కుమార్‌, దృశ్య ర‌ఘునాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు అభిలాష్ ఆర్ నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఒకే సారి అమెజాన్ ప్రైమ్‌, ఆహా, ల‌య‌న్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్‌తో పాటు మ‌నోర‌మా మ్యాక్స్‌, ఏపీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఓటీటీల‌లో రిలీజ్ కాబోతుంది. జూలై 9 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

19 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

కార్పొరేట్ హాస్పిట‌ల్ మోసాల‌కు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌ను జోడించి డైరెక్ట‌ర్ అభిలాష్ ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ తో పాటు ట్విస్ట్‌లు అభిమానుల‌ను మెప్పించాయి. మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన డోస్ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఎనిమిది కోట్ల‌తో బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 19 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. డోస్ మూవీకి గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందించాడు.

కార్పొరేట్‌....

ప్ర‌కాష్ డాక్ట‌ర్‌గా ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తుంటాడు. అత‌డు ప‌నిచేస్తోన్న హాస్పిట‌ల్‌లో ఒకే ర‌క‌మైన ల‌క్ష‌ణాల‌తో కొంద‌రు పేషెంట్లు చ‌నిపోతుంటారు. ఆ మ‌ర‌ణాల వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో ప్ర‌కాష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మెడిక‌ల్ మాఫియా నుండి త‌న భార్య‌ను ఏ విధంగా కాపాడుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా...

సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా సైజు విల్స‌న్ కెరీర్ మొద‌లైంది. మ‌ల‌యాళంలో నేరం, ప్రేమ‌మ్‌, ఆది, గోల్డ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. వ‌సంతి సినిమాకుగాను బెస్ట్ యాక్ట‌ర్‌గా స్టేట్ అవార్డు అందుకున్నాడు.

Advertisement
Advertisement