CM Revanth Reddy | ఆయనకు ఉరిశిక్ష వేసినా తక్కువే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను నాలుగైదు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చోబెట్టినోడికి ఉరిశిక్ష వేసినా తక్కువే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహంకారం, అహంభావంతో పేట్రేగిపోతున్న వాడిని మనం క్షమించాల్నా..? అని నిలదీశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను నాలుగైదు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చోబెట్టినోడికి ఉరిశిక్ష వేసినా తక్కువే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహంకారం, అహంభావంతో పేట్రేగిపోతున్న వాడిని మనం క్షమించాల్నా..? అని నిలదీశారు. మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చాడు.. పాలన రాదని అవహేళన చేశారు. ప్రతి పేదవాడి కష్టం చూసుకుంటూ పెరిగాను. వ్యవసాయం తెలుసు, దుక్కిదున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు.. భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏంటో తెలుసు. రాష్ట్రమంటే, దేశమంటే ఎక్కడో లేదు.. గ్రామాల సమూహామే తెలంగాణ రాష్ట్రం. సమస్యలు ఎక్కడ పరిష్కరించాల్నో గడీల్లో ఉన్న ఈ దొరలకు తెలియకపోవచ్చు. కానీ మాకు తెలుసు. గ్రామాల్లోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం అన్నారు.
పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా..?
పేదల సమస్యలు తెలిసినా నేను సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా..? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా..? తట్ట పనికి, పార పనికి, పలుగు పనికి మనమే కావాలి. పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురంహకారాన్ని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా..? అని నిలదీశారు.
పదేండ్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారో తేల్చండి
ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? సన్నబియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా..? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత ప్రయాణం, 21 వేల కోట్ల రుణమాఫీ, 36 వేల కోట్ల రైతు భరోసా, ఉచిత విద్యుత్ కోసం 30 వేల కోట్లు ఖర్చు పెట్టినం. ఒక లక్షా 76 వేల కోట్లు ఇప్పుడు రైతు భరోసాకు ఖర్చు పెట్టాం. నెలకు సగటున రూ. 5600 కోట్లు ఖర్చు పెడితే పదేండ్లలో మీరు ఎంత ఖర్చు పెట్టారో తేల్చండి అని సీఎం సవాల్ విసిరారు.
పాపాల భైరవుడు మళ్లీ రావాలని గుండెలు బాదుకుంటున్నారు
70 వేల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పితే 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు చేశారు. ఏడాదికి 2 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టినా.. పదేండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టించేవారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా..? కోటి ఎకరాలకు నీరు పారించడా.? కాళేశ్వరం కూలేశ్వరం అయి లక్ష కోట్లు గోదావరి పాలయ్యాయి. ఇది కేసీఆర్ పరిపాలనా..? కొడుకు, అల్లుడు గద్దల మాదిరి ఊరురా తిరుగుతున్నారు.. పాపాల భైరవుడు బయటకు రావాల్నట.. మనం పోవాల్నట..? పాపాల భైరవుడు మళ్లీ రావాలని గుండెలు బాదుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.
దుర్మార్గుడా.. నీచుడా.. బతుకమ్మ చీరలను కూడా వదల్లేదు
ప్రజా పాలన ఎందుకు పోవాలి..? పెళ్లి కాడ, చావుకాడ, దావత్ వద్ద, బీర్, బార్ షాపుల వద్ద, కల్లు దుకాణం వద్ద ఏడికి పోయినా చర్చ పెట్టండి. ప్రజా పాలన ఎందుకు పోవాలి.. ఫామ్ హౌజ్‌లో బంధి అయినా పాపాల భైరవుడు ఎందుకు రావాల్నో చర్చ పెట్టండి. ఏం అన్యాయం చేశామని ప్రజా పాలన పోవాలి.. ప్రజలు కోరుకున్న, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వం ఇది. ఎందుకంటే దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయి.. ప్రజలను దోచుకున్నారు.. 1000 ఎకరాల ఫామ్ హౌజ్ ఎక్కడ్నుంచి వచ్చింది..? వంద ఎకరాల ఫామ్ హౌజ్ జన్వాడలో కొడుకు ఎలా వచ్చింది..? అల్లుడికి మొయినాబాద్‌లో 50 ఎకరాల్లో ఫామ్ హౌజ్, శంకర్ పల్లిలో 25 ఎకరాల్లో కవితకు ఫామ్ హౌజ్‌లు వచ్చాయి. ఎక్కడ సంపాదించారు ఈ ఆస్తులన్నీ.. ఎక్కడ్నుంచి వచ్చాయి. వారి పాలనలో తెలంగాణ అప్పుల పాలైంది.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఉద్యోగాలు రాలేదు. బతుకమ్మ చీరల్లో కమీషన్లు కొట్టారు. దుర్మార్గుడా.. నీచుడా బతుకమ్మ చీరలను కూడా వదల్లేదు దోపిడీ కోసం.. అందుకోసం నీవు రావాల్నా.. వాళ్లు లక్ష కోట్లు ఎట్ల సంపాదించారో ఆలోచన చేయండి.. అప్పులు 8 లక్షల 21 వేల కోట్లు మన మీద మోపారు. వీటి మీద ఆలోచన చేయండి. అరుంధతి సినిమాలో పశుపతిని బూతు బంగ్లాలో ఎలా బంధించారో.. నాలుగుకోట్ల ప్రజలు గొలుసులు వేసి బంధించారు. మీకు భవిష్యత్ లేదు.. ముగింపు పలికారు అని సీఎం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Malayalam OTT | ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్ కానున్న మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్
- ●Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
- ●CM Revanth Reddy | భట్టి గారూ.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖర్చు - రిటర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ - గ్రాండ్‌గా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వెడ్డింగ్
- ●CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ●Ponguleti | భవనాలన్నీ ఒకే డిజైన్‌లో ఉండాలే.. సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలే

Malayalam OTT | ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్ కానున్న మలయాళం మెడికల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ

CM Revanth Reddy | భట్టి గారూ.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖర్చు - రిటర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ - గ్రాండ్‌గా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వెడ్డింగ్




