త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | భ‌ట్టి గారూ.. మిడ్జిల్ మండ‌లాన్ని ద‌త్త‌త తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | నా రాజకీయ ఎదుగుద‌ల‌కు బీజం వేసినా మిడ్జిల్ మండ‌లానికి ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే మిడ్జిల్ మండ‌లాన్ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ద‌త్త‌త తీసుకోని అభివృద్ధి చేయాల‌ని కోరారు.

S

Telangana | Published On Jul 4, 2026, 7.06 pm IST

CM Revanth Reddy | భ‌ట్టి గారూ.. మిడ్జిల్ మండ‌లాన్ని ద‌త్త‌త తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నా రాజకీయ ఎదుగుద‌ల‌కు బీజం వేసినా మిడ్జిల్ మండ‌లానికి ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే మిడ్జిల్ మండ‌లాన్ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ద‌త్త‌త తీసుకోని అభివృద్ధి చేయాల‌ని కోరారు. మిడ్జిల్ మండ‌లంలో ఏర్పాటు చేసిన కృత‌జ్ఞ‌త స‌భ‌లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

జులై 4 2006 నాడు ఆనాటి ఉమ్మ‌డి ఏపీ ముఖ‌చిత్రం మీద ఈ మిడ్జిల్ మండ‌ల ప్ర‌జ‌లు సువ‌ర్ణాక్ష‌రాల‌తో ఒక చరిత్ర‌ను లిఖించిన రోజు. 20 ఏళ్ల త‌ర్వాత 2026లో అదే తారీఖున జులై 4న మీ అభిమాన నాయ‌కుడు నాప్రియ మిత్రులు అనిరుధ్ రెడ్డి.. ఆత్మీయ స‌మ్మేళ‌నాన్ని ఏర్పాటు చేసి ఆనాడు మీరు నాటి న మొక్క ఈనాడు రాష్ట్రానికి వృక్ష‌మై ద‌శ దిశా నిర్దేశం చేసే అవ‌కాశాన్ని అందించింనందుకు కృత‌జ్ఞ‌త తెలియ‌జేస్తున్నాను అని రేవంత్ పేర్కొన్నారు.

ఉరుములు ఉరిమినా.. పిడుగులు ప‌డ్డా..

ఉరుములు ఉరిమినా, పిడుగులు ప‌డ్డా, ఈ వాన‌ తుపాను అయినా ఈ స‌మావేశాన్ని దిగ్విజ‌యం చేయాల‌ని ఒక గుండె ధైర్యంతో వ‌చ్చినందుకు మిడ్జిల్ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. హైద‌రాబాద్ స్టేట్‌ సీఎంగా బూర్గుల రామ‌కృష్ణారావుకు తొలిసారి అవ‌కాశం వ‌చ్చింది. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్‌గా జైపాల్ రెడ్డి ఎంపిక‌య్యారు. ఆయ‌న ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. ద్యాప గోపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు తోడ్పాటునందించారు. ఈ ప్రాంతం నుంచే మ‌హేంద్ర‌నాథ్ ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డారని రేవంత్ గుర్తు చేశారు.

ఈ గెలుపు నాది కాదు..

ఈ గెలుపు నాది కాదు.. జ‌డ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా గెలిపించారంటే.. మిడ్జిల్ మండ‌ల ప్ర‌జ‌ల‌ది గెలుపు. ఎందుకంటే జ‌డ్పీటీసీగా నామినేష‌న్ వేసే స‌మ‌యంలో ఇక్క‌డ ఎవ‌రూ నాకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఆనాడు మిత్రుల సూచ‌న మేర‌కు మిడ్జిల్ మండ‌లంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశాను. క‌ప్పు సాస‌ర్ గుర్తు కేటాయించారు. వైఎస్సార్ ర‌బ్బానీని పోటీలో దించి జ‌డ్పీటీసీగా పోటీ చేయించారు. ఆనాడు మీరు ఏం ఆలోచ‌న చేశారో.. ఉప్పెనై నిర్ణ‌యం తీసుకున్నారో.. జిల్లా పరిష‌త్ మెంబ‌ర్‌గా ఆశీర్వ‌దించారు. మీ నిర్ణ‌యం , ఆశీర్వాదం గొప్ప నిర్ణ‌య‌మ‌ని ఈ రోజు నిరూపించ‌బ‌డింది అని రేవంత్ తెలిపారు.

ర‌బ్బానీకి నేటి ప్ర‌భుత్వంలో మంచి బాధ్య‌త ఇవ్వండి..

డిప్యూటీ సీఎంకు సూచ‌న చేస్తున్నా.. ఆనాడు నా మీద ఓడిన ర‌బ్బానీకి నేటి ప్ర‌భుత్వంలో మంచి బాధ్య‌త ఇవ్వండి. 35 ఏండ్లు ర‌బ్బానీ సేవ‌లందించారు. మ‌రి ఆనాడు అనుకోని ప‌రిస్థితుల్లో ర‌బ్బానీ ఓట‌మి చెందారు.. నేను గెలిచాను.. అవ‌కాశం ఇచ్చేందుకు మ‌న చేతిలో బాధ్య‌త ఉంది.. ఆ బాధ్య‌త‌ తీసుకోవాల్సిందిగా డిప్యూటీ సీఎంకు సూచ‌న చేస్తున్నా అని సీఎం పేర్కొన్నారు.

ఇంత‌కంటే నేను చేయ‌గ‌లిగింది ఏమీ లేదు

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో మిడ్జిల్, గ‌ట్టు మండ‌లాల‌ను డార్క్ మండ‌లాలుగా ప్ర‌క‌టించారు. ఎలాంటి సౌక‌ర్యాలు లేని అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతాల‌ను డార్క్‌ మండ‌లాలుగా ప్ర‌క‌టించారు. భూమిలో ఉన్న నీరు కూడా అందుబాటులో లేక‌పోవ‌డ‌మే డార్క్ మండ‌లాలుగా ప్ర‌క‌టించారు. కానీ చైత‌న్యంతో చీక‌టి మండ‌లంలో వెలుగు రేఖ రావాల‌ని 2006లో తీసుకున్న నిర్ణ‌యం ఈనాడు సీఎంగా అవ‌కాశం వ‌చ్చింది. కాబ‌ట్టి కృత‌జ్ఞ‌త చెల్లించాల్సిన బాధ్య‌త ఉంది. ఈ మండ‌లంలోని ప్ర‌తి గ్రామంలో అభివృద్ధి జ‌ర‌గాలి. ఈ మండ‌లం అభివృద్ధి జ‌ర‌గాలి. జిల్లాకే ఆద‌ర్శంగా నిల‌బ‌డాలి. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ద‌త్త‌త తీసుకొని అభివృద్ధి కార్య‌క్ర‌మాలను ప‌ర్య‌వేక్షించాల్సిన బాధ్య‌త తీసుకోవాలి. ఇంత‌కంటే నేను చేయ‌గ‌లిగింది ఏమీ లేదు అని సీఎం అన్నారు.

20 ఏండ్ల‌లో ఏ ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు

20 ఏండ్ల‌లో ఏ ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు. నా స్వార్థ ప్ర‌యోజనాల‌కు దుర్వినియోగం చేయ‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ప్ర‌శ్నించే గొంతుక‌నై ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాను. అధికారం వస్తే ప‌రిపాల‌న‌లో సంక్షేమం, అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement