లోడ్ అవుతోంది...

Disha Patani | బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ప్రేమలో పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల న్యూ ఇయర్‌ను గోవాలో సెలబ్రేట్ చేసుకుంది దిశా పటానీ. తన స్నేహితులతో కలిసి గోవా బీచ్‌లో చక్కర్లు కొట్టింది. ఓ మాస్క్ మ్యాన్‌తో రొమాంటిక్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖం కనిపించకుండా మాస్క్ ధరించడంతో అతడెవరన్నది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది . దిశా పటానీ కొత్త బాయ్‌ఫ్రెండ్ అతడే అంటూ వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. పంజాబీ సింగర్ తల్వీందర్‌తో దిశా పటానీ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు చెబుతోన్నారు.
ఇటీవల కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ వివాహం ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఈ పెళ్లికి తల్వీందర్‌తో కలిసి దిశా పటానీ హాజరైంది. పెళ్లి వేడుకలో ఇద్దరు చాలా క్లోజ్‌గా కనిపించారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వేడుకలో సందడి చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నుపుర్ పెళ్లి వేడుకకు వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరి బాండింగ్ చూసిన నెటిజన్లు దిశా పటానీ, తల్వీందర్ ప్రేమాయణం నిజమేనని అంటున్నారు.
నుపుర్ సనన్ పెళ్లి ముగిసిన తర్వాత కూడా తల్విందర్‌తో కలిసి దిశా పటానీ ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఇద్దరు జంటగా ముంబాయి చేరుకున్నారు.
తల్విందర్ సింగర్‌గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు పంజాబీ సినిమాలకు పనిచేశారు. విషెస్, తేరా చేహ్రా వంటి పాటలతో పాపులర్ అయ్యాడు. కాన్సెర్ట్‌లలో ఎక్కువగా మాస్క్ ధరించే కనిపిస్తారు. ఆ స్టైల్ అతడికి యూత్ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.
కాగా దిశా పటానీ గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. పెళ్లి వరకు వెళ్లిన వీరి లవ్‌స్టోరీకి మనస్పర్థల కారణంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత అలెగ్జాండర్ అలెక్స్ అనే బిజినెస్ మెన్‌తో దిశా డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ లోఫర్‌తోనే దిశా పటానీ యాక్టింగ్ జర్నీ మొదలైంది. తెలుగులో ప్రభాస్ కల్కి 2898 ఏడీలో హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది రిలీజైన సూర్య కంగువతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam