త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venu Udugula | ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు – మంగ్లీ కేసుపై డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ష‌న్‌

సింగ‌ర్ మంగ్లీ కేసుతో సంబంధం ఉందంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై టాలీవుడ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ట్ అయ్యారు. అవ‌న్నీ పుకార్లేన‌ని అన్నారు. ఈ కేసులో నిందితుడిగా త‌న పేరును పోలీసులు ఎక్క‌డ ప్ర‌స్తావించ‌లేద‌ని చెప్పారు.

N

Entertainment | Published On Apr 11, 2026, 8.35 pm IST

Venu Udugula | ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు – మంగ్లీ కేసుపై డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ష‌న్‌
Advertisement

Venu Udugula | మైక్రో ఫైనాన్స్ లాభాల పేరుతో మోసాల‌కు పాల్ప‌డ్డారంటూ సింగ‌ర్ మంగ్లీపై కేసు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌కు సంబంధం ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై వేణు ఊడుగుల‌ రియాక్ట్ అయ్యారు. మంగ్లీ కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు. ఈ పుకార్లు త‌న‌ను ఎంత‌గానో బాధ‌పెట్టాయ‌ని అన్నారు. ఈ మేర‌కు ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.

వార్తలు బాధపెట్టాయి...

వేణు ఊడుగుల స్పందిస్తూ -" గాయని మంగ్లీ కేసులో నా పేరు ఉందంటూ వస్తోన్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు"అని వేణు ఊడుగుల అన్నారు

నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో...

త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి సింగ‌ర్ మంగ్లీ కూడా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. లాయ‌ర్ సుభా సింగ‌భోష్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో 150 కోట్లు మోసం చేశానంటూ సుభా సింగ‌భోష్ త‌న గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఈ ఫిర్యాదులో మంగ్లీ పేర్కొన్న‌ది. త‌న‌ను అప్ర‌తిష్ట పాలు చేయ‌డ‌మే కాకుండా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ తెలిపింది.

 

Advertisement
Advertisement