Director Shankar | యాక్టర్‌గా మారనున్న డైరెక్టర్ శంకర్ – రజనీకాంత్ సినిమాలో విలన్‌గా?
ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ డిజాస్టర్లతో డైరెక్షన్‌కు గ్యాప్ ఇచ్చిన అగ్ర దర్శకుడు శంకర్ యాక్టర్‌గా కెమెరా ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మించనున్న సినిమాలో శంకర్ విలన్‌గా కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Apr 21, 2026, 6.27 pm IST
Director Shankar | ఒకప్పుడు దక్షిణాదిలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే శంకర్ పేరు వినిపించేది. శంకర్ తో సినిమాలు చేసేందుకు కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూసేవారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలన్న, కొత్త రికార్డులను నెలకొల్పాలన్న శంకర్ సినిమాలతోనే సాధ్యమయ్యేది. జెంటిల్‌మెన్ నుంచి రోబో వరకు శంకర్ దర్శకత్వం వచ్చిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి.
డిజాస్టర్లు...
రోబో 2.ఓ నుంచి శంకర్ బ్యాడ్‌టైమ్ స్టార్టయ్యింది. కమల్‌హాసన్ ఇండియన్ 2తో పాటు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలతో శంకర్‌పై దారుణంగా ట్రోల్ వచ్చాయి. డైరెక్టర్‌గా శంకర్ ఔట్‌డేటెడ్ అయ్యారంటూ విమర్శించారు.
ఈ పరాజయాల కారణంగా శంకర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. శంకర్ పేరు చెబితేనే భయపడుతున్నారు. ఈ డిజాస్టర్లతో శంకర్ తన రూటును మార్చినట్లు సమాచారం. మెగా ఫోన్ గ్యాప్ ఇచ్చి యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టాఅని అనుకుంటున్నారట.
రజనీకాంత్ సినిమాలో...
ఇప్పటికే తమిళంలో చాలా మంది సీనియర్ డైరెక్టర్లు యాక్టర్లుగా సెకండ్ ఇన్నింగ్స్‌లను మొదలుపెట్టి బిజీ అయ్యారు. వారి బాటలోనే శంకర్ అడుగులు వేయబోతున్నాడట.
రజనీకాంత్ హీరోగా విలక్షణ నటుడు కమల్‌హాసన్ నిర్మాణంలో ఓ తమిళ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శంకర్ విలన్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్ రోల్ కోసం శంకర్‌ను డైరెక్టర్ సిబీ చక్రవర్తి అప్రోచ్ అయ్యారట.
దర్శకుడు తన పాత్రను సిద్ధం చేసిన తీరు నచ్చడంతో విలన్‌గా నటించడానికి శంకర్ అంగీకరించినట్లు చెబుతోన్నారు. దర్శకుడి ఐడియాకు రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన శివాజీ, రోబో సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా రజనీ సినిమాలో శంకర్ విలన్‌గా కనిపించబోతుండటం అభిమానుల్లో ఉత్కంఠను పంచుతోంది.
కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న రోజుల్లో సీత, వసంత రాగంతో పాటు మరికొన్ని సినిమాల్లో శంకర్ కీలక పాత్రలు పోషించారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రజనీకాంత్ సినిమాతో యాక్టర్‌గా కెమెరా ముందుకు రాబోతున్నారు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



