Nag Ashwin | ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింద కూర్చున్న నాగ్ అశ్విన్ – కల్కి డైరెక్టర్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా
నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతోన్నారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో నాగ్ అశ్విన్ నిర్మించిన సింగ్ గీతం మూవీ జూన్ 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ కిందనే కూర్చున్నారు.
Entertainment | Published On Jun 7, 2026, 4.05 pm IST
Nag Ashwin |సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతోన్న సింగ్ గీతం మూవీ జూన్ 11న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో అయాన్, అహల్యా బుమ్రా, శాలిని కొండెపూడి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్ గెస్ట్...
సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో గెస్ట్‌లకు కేటాయించిన సీట్లు సరిపోకపోవడంతో నాగ్ అశ్విన్ కిందనే కూర్చున్నారు. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతోన్నారు. కల్కి లాంటి ఇండస్ట్రీ హిట్టు ఇచ్చిన డైరెక్టర్ అయినా నాగ్ అశ్విన్‌లో ఆ గర్వం కొంచెం కూడా కనిపించదని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగీతం ఆశీర్వాదం తీసుకునే సమయంలో నాగ్ అశ్విన్ చెప్పులు తీసేసి స్టేజ్‌పైకి ఎక్కారు.
మాటలు లేకుండా....
నాగ్ అశ్విన్ కోసం కుర్చీ తీసుకొస్తామని యూనిట్ సభ్యులు చెప్పారు. కానీ సింగీతం శ్రీనివాసరావు, కమల్‌హాసన్‌లపై గౌరవంతో కిందనే కూర్చుంటానని నాగ్ అశ్విన్ అన్నారు. మాటలు లేకుండా కేవలం పాటలతోనే ప్రయోగాత్మకంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సింగీతం శ్రీనివాసరావు.
జూలైలో ప్రభాస్...
ప్రస్తుతం కల్కి 2 మూవీ షూటింగ్‌తో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూలై నుంచి కల్కి సీక్వెల్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లు సమాచారం.
సింగీతం గారికి Nag Ashwin ఇచ్చే గౌరవం...👏
చెప్పులు తీసేసి వెళ్ళడం 👌 pic.twitter.com/GKwURcu72q
— Rajesh Manne (@rajeshmanne1) June 7, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే – జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
జూన్ 7, 2026

Dimple Hayathi | హీరోయిన్లను కాదు.. వ్యవస్థను ప్రశ్నించాలి: డింపుల్ హయతి
జూన్ 7, 2026

Samantha | సమంతకు సాయిపల్లవి ఆఫర్ – టాప్ హీరోయిన్ల కాంబోలో సినిమా
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే - జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
- ●IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘన్‌పై భారత్ ఆధిపత్యం.. అరంగేట్రంలో అలరించిన మానవ్
- ●Harish Rao | కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నరు
- ●IND Vs AFG Test | ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ షా చరిత్ర..
- ●Heavy Rains | 11వ తేదీ వరకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ●Raghava Lawrence | రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్.. ఈ నెల 11న కీలక ప్రకటన

Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే - జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్

IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘన్‌పై భారత్ ఆధిపత్యం.. అరంగేట్రంలో అలరించిన మానవ్

Harish Rao | కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నరు

IND Vs AFG Test | ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ షా చరిత్ర..



