Buchi Babu Sana | పెద్ది ఎన్టీఆర్ కోసం రాసిన కథ కాదు…చిరంజీవి తిడతారనుకున్నా – పెద్దిపై బుచ్చిబాబు సానా కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథతో పెద్ది మూవీని రామ్‌చరణ్‌తో తెరకెక్కించినట్లు వస్తోన్న వార్తలపై బుచ్చిబాబు సానా రియాక్ట్ అయ్యారు. పెద్ది కథను రామ్‌చరణ్ కోసమే సిద్ధం చేసినట్లు చెప్పారు.
Entertainment | Published On Jun 2, 2026, 8.25 pm IST
పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో నిలిచిపోతాడని డైరెక్టర్ బుచ్చిబాబు సానా అన్నారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పెద్ది సినిమా విశేషాలతో పాటు ఈ సినిమా జర్నీ గురించి బుచ్చిబాబు సానా ఏమన్నాడంటే?
సుకుమార్ వల్లే...
నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). గురువు సుకుమార్ ద్వారా రామ్‌చరణ్‌ను కలిసి పెద్ది కథ వినిపించా. ఉప్పెన హిట్టైనా చరణ్ దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథతో పెద్ది తెరకెక్కించినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు.
ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా రామ్‌చరణ్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయాలని రామ్‌చరణ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశా.
రెజ్లింగ్ విషయంలో...
క్రికెట్ అందరికీ తెలిసిన ఆటే. కానీ రెజ్లింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్‌కు కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. తెలంగాణలోని పహిల్వాన్లను కూడా పెద్దిలో భాగం చేశాం. రామ్‌చరణ్ ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా కుస్తీ ఆటలో శిక్షణ తీసుకున్నారు. పెద్ది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఫిక్షనల్ స్టోరీ. 1985 టైమ్ పీరియడ్‌లో సాగుతుంది. ఆ నాటి పరిస్థితులను సహజంగా రీక్రియేట్ చేశాం.
థియేటర్లకు వస్తారా అనుకున్నాం...
సినిమా సక్సెస్ ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలతో పాటు ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం ఇంకాస్త గట్టిగా ఉంది. ఉప్పెన సమయంలో కూడా పరిస్థితి అలానే ఉండేది. కోవిడ్ కారణంగా అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.
కలర్‌ఫుల్....
పెద్దిలో రామ్‌చరణ్, జాన్వీ లవ్ ట్రాక్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. జాన్వీ చాలా డెడికేటెడ్ పర్సన్. నటన పట్ల ఆమెలో చాలా ప్యాషన్ ఉంది. వినయం ఎక్కువే. రామ్‌చరణ్ గురువుగా ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. 350 కోట్ల బడ్జెట్‌తో పెద్ది మూవీని తెరకెక్కించాం. హీరోని బట్టి సినిమా బడ్జెట్, రేంజ్ మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే ఇంత గ్రాండియర్‌గా ఉండకపోయుండేది.
పెద్ది గుండెల్లో ఉంటాడు...
అల్లు అర్జున్ పుష్పతో పెద్దిని కంపేర్ చేస్తూ వస్తోన్న వార్తలపై బుచ్చిబాబు రియాక్ట్ అయ్యారు. పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు అని చెప్పారు. పెద్ది షూటింగ్‌లో రామ్‌చరణ్‌కు చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అనుకున్నా. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌లో పొరపాటున తగిలింది. చిరంజీవికి ఆ వీడియో పంపించాం. కానీ ఆయన ఏం అనలేదు. పెద్దిలో చిరంజీవి అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. ఆ పాట వినిపించినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం అని వెల్లడించాం. చిరంజీవి ఇంకా సినిమా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.
కత్తి మీద సాము...
పెద్ది పాత్ర కోసం చరణ్ అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు.
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ – ఆఫర్ల కోసమేనా?
జూన్ 2, 2026

Peddi | తెలంగాణలో రామ్ చరణ్ పెద్ది టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే ? – బెనిఫిట్ షోలకు పర్మిషన్
జూన్ 2, 2026

Tollywood | తెలంగాణ యాస వచ్చినోళ్లకు సినిమా ఛాన్స్ – జమ్మికుంట కథతో రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కొత్త మూవీ
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Congress MLA Anirudh Reddy | "నాలుక జాగ్రత్త పవన్.. కావాలంటే గుజరాత్లో పార్టీ పెట్టుకో!" పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
- ●Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?
- ●Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!
- ●Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు
- ●Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోషూట్ - ఆఫర్ల కోసమేనా?
- ●Kavitha | మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూ పోరాటం : కవిత

Congress MLA Anirudh Reddy | "నాలుక జాగ్రత్త పవన్.. కావాలంటే గుజరాత్లో పార్టీ పెట్టుకో!" పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

Machiavellian Politics Telangana | ఆంధ్రా నాయకుల 'మెకియవెల్లీ' గేమ్.. రేవంత్ సర్కార్ సపోర్ట్! తెలంగాణ చైతన్యాన్ని టార్గెట్ చేస్తున్న 'బిగ్ ఫిష్' ఎవరు?

Uttam Kumar Reddy | పాలమూరులో నీటిపారుదలపై సీఎం రేవంత్ ఫోకస్.. రెండు రోజుల పర్యటనలో ప్రాజెక్టుల తనిఖీ..!

Nepal PM Balen Shah | 'మేమూ ఇండియాలోకి చొరబడ్డాం'.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు, విద్యార్థులు



