త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | ఫ్లాపుల్లో ఉన్నా క్రేజ్ త‌గ్గేదేలే… డింపుల్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చిన మాస్ మ‌హారాజా

ఖిలాడి, భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి త‌ర్వాత ర‌వితేజ‌తో ముచ్చ‌ట‌గా మూడో సారి జోడీక‌ట్ట‌బోతుంది డింపుల్ హ‌య‌తి. ర‌వితేజ హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌న్ యాక్ష‌న్ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా డింపుల్ హ‌య‌తి క‌న్ఫామ్ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Jul 20, 2026, 4.05 pm IST

Dimple Hayathi | ఫ్లాపుల్లో ఉన్నా క్రేజ్ త‌గ్గేదేలే… డింపుల్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చిన మాస్ మ‌హారాజా
Advertisement

Dimple Hayathi | సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా ఒక‌టి రెండు ఫ్లాపులు ఎదురైతే చాలు వారి కెరీర్ డైల‌మాలో ప‌డుతుంది. అవ‌కాశాలు రావ‌డం క‌ష్టంగా మారుతుంది. కానీ అచ్చ తెలుగు బ్యూటీ డింపుల్ హ‌య‌తి మాత్రం ఇందుకు మిన‌హాయింపుగా నిలుస్తోంది. డింపుల్ హ‌య‌తి సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మై తొమ్మిదేళ్లు దాటింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డంతో పాటు హిందీ భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ప‌ద‌కొండు సినిమాలు చేసింది. ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. అయినా ఈ అమ్మ‌డి క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. చ‌క్క‌టి ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకుంటోంది.

వివేక్ ఆత్రేయ....

ఈ ఏడాది సంక్రాంతికి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ఈ బ్యూటీ. ఇందులో భ‌ర్త‌ను అతిగా ప్రేమించే ఇల్లాలిగా క‌నిపించింది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా మాస్ మ‌హారాజాతో మ‌రోసారి ఈ అమ్మ‌డు జోడీక‌ట్ట‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ర‌వితేజ హీరోగా....వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌న్ యాక్ష‌న్ డ్రామా మూవీ రానున్న‌ట్లు స‌మాచారం. ర‌వితేజ శైలి మాస్ హంగుల‌తో పాటు వివేక్ ఆత్రేయ స్టైల్ సెటైరిక‌ల్ కామెడీతో ఈ సినిమా డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

మూడో సినిమా...

ర‌వితేజ‌, వివేక్ ఆత్రేయ సినిమాలో హీరోయిన్‌గా డింపుల్ హ‌య‌తి క‌న్ఫామ్ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. క‌థానాయిక‌గా ఈ ముద్దుగుమ్మ పేరును ర‌వితేజ‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి కాంబినేష‌న్‌లో రాబోతున్న మూడో మూవీ ఇది. భ‌ర్త మ‌హాశ‌యులకు విజ్ఞ‌ప్తి కంటే ముందు వీరిద్ద‌రు క‌లిసి ఖిలాడీలో న‌టించారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ర‌వితేజ, వివేక్ ఆత్రేయ మూవీ సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం తెలుగులో భోగి సినిమా చేస్తోంది డింపుల్ హ‌య‌తి. శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మందార అనే బోల్డ్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది.

 

Advertisement
Advertisement