త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | బోల్డ్ బ్యూటీకి మెగా ఆఫ‌ర్ – చిరంజీవి సినిమాలో విల‌న్‌గా?

అచ్చ తెలుగు హీరోయిన్ డింపుల్ హ‌య‌తి మెగా ఛాన్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో డింపుల్ హ‌య‌తి న‌టించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Apr 23, 2026, 1.06 pm IST

Dimple Hayathi | బోల్డ్ బ్యూటీకి మెగా ఆఫ‌ర్ – చిరంజీవి సినిమాలో విల‌న్‌గా?
Advertisement

Dimple Hayathi |  తెలుగులో స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలొస్తున్న డింపుల్ హ‌య‌తికి స‌క్సెస్ మాత్రం ద‌క్క‌డం లేదు. టాలీవుడ్‌తో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ప‌దికిపైగానే సినిమాలు చేసింది ఈ అచ్చ తెలుగు బ్యూటీ. కానీ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా చెప్పుకోద‌గ్గ హిట్టు ఆమె ఖాతాలో లేదు. ఈ డిజాస్ట‌ర్ల‌తో సంబంధం లేకుండా హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది.

మెగా ఆఫ‌ర్‌...

ఈ ఏడాది ర‌వితేజ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో న‌టించింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ భోగితో పాటు మ‌రో సినిమా చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ మెగా ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్‌లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. సాండ‌ల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ త్వ‌ర‌లో సెట్స్‌పైకి రాబోతుంది.

నెగెటివ్ షేడ్స్‌తో...

చిరంజీవి సినిమాలో డింపుల్ హ‌య‌తి ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ఈ అచ్చ తెలుగు బ్యూటీ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. గ్లామ‌ర్‌, విల‌నిజం క‌ల‌బోత‌గా ఛాలెంజింగ్‌గా డింపుల్ హ‌య‌తి రోల్ ఉంటుంద‌ని అంటున్నారు.

టైటిల్‌...కాకా...

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌ల‌యాళ యంగ్ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు టాక్‌. ఈ సినిమాకు కాకా అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట బాబీ.
ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లోనే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ జ‌న‌నాయ‌గ‌న్ లీక్ కార‌ణంగా వాయిదాప‌డింది. త్వ‌ర‌లోనే ఓపెనింగ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించ‌బోతున్నారు. వాల్తేర్ వీర‌య్య త‌ర్వాత చిరంజీవి, బాబీ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.

Advertisement
Advertisement