త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ

అచ్చ తెలుగు హీరోయిన్ డింపుల్ హ‌య‌తి టాలీవుడ్‌లో మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న‌ది.

N

Entertainment | Published On Mar 29, 2026, 1.13 pm IST

Dimple Hayathi  | బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ
Advertisement

Dimple Hayathi |  అచ్చ తెలుగు బ్యూటీ డింపుల్ హ‌య‌తికి కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ హిట్టు ఒక్క‌టి లేదు. అయినా టాప్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ధ‌నుష్, ర‌వితేజ , గోపీచంద్ వంటి హీరోల‌తో జోడీ క‌ట్టిన‌ ఈ ముద్దుగుమ్మ తాజాగా మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు టాలీవుడ్‌లోకి టాక్ వినిపిస్తోంది.

ఎన్‌బీకే 111....

వీర‌సింహారెడ్డి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతుంది. ఎన్‌బీకే 111 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార మెయిన్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. క‌థానుగుణంగా బాల‌కృష్ణ మూవీలో మ‌రో నాయిక‌కు చోటు ఉంద‌ట‌. ఈ సెకండ్ హీరోయిన్ ప్లేస్‌లో డింపుల్ హ‌య‌తి మేక‌ర్స్‌ను ఎంపిక‌చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తెలుగు హీరోయిన్‌నే తీసుకోవాల‌ని భావించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు డింపుల్ హ‌య‌తికి అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామా....

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఎన్‌బీకే 111 మూవ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకాబోతుంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
తొలుత బాల‌కృష్ణ మూవీ కోసం ఓ హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌ను గోపీచంద్ మ‌లినేని రెడీ చేశారు. కానీ బ‌డ్జెట్ ఎక్కువైపోవ‌డంతో అఖండ 2 డిజాస్ట‌ర్ కార‌ణంగా ఆ క‌థ‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఓ క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్ట్ తో ఈ సినిమా చేయ‌బోతున్నారు డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. ఎన్‌బీకే 111 మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పెద్ది సినిమా ప్రొడ్యూస‌ర్ వెంక‌ట స‌తీష్ కిలారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శ‌ర్వానంద్ భోగిలో...

కాగా ఇటీవ‌లే సంక్రాంతికి రిలీజైన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టించింది. ర‌వితేజ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భోగిలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు మ‌రో హీరోయిన్‌గా డింపుల్ హ‌య‌తి న‌టిస్తోంది. ఈ ఏడాదే భోగి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement