Dimple Hayathi | నేను సింగిల్ – పెళ్లి వార్తలపై టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ
తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నది డింపుల్ హయతి. ఆ రూమర్స్‌ను నమ్మవద్దంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
Entertainment | Published On Jan 20, 2026, 3.01 pm IST
Dimple Hayathi | భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది డింపుల్ హయతి(Dimple Hayathi). రవితేజ హీరోగా నటించిన ఈ మూవీలో బాలామణి అనే క్యారెక్టర్‌లో కనిపించింది. భర్తపై అమితమైన ప్రేమానురాగాలు కలిగిన యువతి పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రవితేజ, డింపుల్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఫొటోలు వైరల్...
కాగా డేవిడ్ అనే వ్యక్తిని డింపుల్ హయతి పెళ్లి చేసుకున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్దల అంగీకారంతో సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారంటూ వార్తలు వచ్చాయి. విక్టర్ డేవిడ్‌తో జంటగా డింపుల్ కనిపించిన ఫొటోలో అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ పెళ్లి వార్తలపై డింపుల్ రియాక్ట్ అయ్యింది. అవన్నీ పుకార్లేనని అన్నది. "నాకు పెళ్లయిందంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ప్రజెంట్ నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా వ్యక్తిగత జీవితం గురించి గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే నేనే స్వయంగా అందరికి తెలియజేస్తా. దాచాల్సిన పనిలేదు. దయచేసి ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయవద్దు. వీటిని ఎవరూ నమ్మవద్దు" అని సోషల్ మీడియా ద్వారా డింపుల్ వెల్లడించింది.
కెరీర్‌పైనే ఫోకస్...
డేవిడ్ విక్టర్ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అతడితో సన్నిహితంగా ఉండటంతోనే కొందరు ఇలాంటి రూమర్లను క్రియేట్ చేశారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు చెప్పింది.
2017లో వచ్చిన గల్ఫ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. ఖిలాడీ, రామబాణంతో పాటు తెలుగులో మరికొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో అట్ రంగీరే తో పాటు కన్నడ, తమిళ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక్క హిట్టు అందుకోలేకపోయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా యావరేజ్‌గానే నిలిచింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కొన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు ఈ మూవీ ప్రమోషన్స్‌లో వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026

Rahul Ramakrishna | భ్రమల నుంచి బయటకు రాకపోతే …ఖాళీ థియేటర్లే గతి – రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
మే 12, 2026

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ అదిరిందిగా!
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



