Toxic | దిల్‌రాజు రిస్క్ చేస్తున్నాడా? – రికార్డ్ ధరకు టాక్సిక్ థియేట్రికల్ రైట్స్ డీల్
యశ్ టాక్సిక్ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను దిల్‌రాజు సొంతం చేసుకుంది. భారీ పోటీ మధ్య 120 కోట్లకు హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Feb 6, 2026, 4.28 pm IST
Toxic | యశ్ (Yash) టాక్సిక్ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ (Theatrical Rights) భారీ ధరకు అమ్ముడుపోయాయి. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ హైప్ నెలకొంది. సాండల్‌వుడ్, టాలీవుడ్ అని భేదాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిల్‌రాజు చేతికి...
టాక్సిక్ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య 120 కోట్లకు దిల్‌రాజు తెలుగు హక్కులను దక్కించుకున్నారు. తెలుగులో అత్యధిక ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిన డబ్బింగ్ మూవీగా టాక్సిక్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు తెలుగులో రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. ఈ సక్సెస్‌లతో టాక్సిక్ మూవీ థియేట్రికల్ హక్కుల కోసం అగ్ర నిర్మాతలు పోటీ పడ్డారు. 50 నుండి 60 కోట్ల మధ్య హక్కులు అమ్ముడుపోవచ్చునని ప్రచారం జరిగింది. ఏకంగా 120 కోట్లు ధర పలకడం టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 250 కోట్లకుపైనే రాబట్టాల్సివుంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్వాన్స్ బేసిస్‌లో దిల్‌రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తోన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్...
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజైన టీజర్‌తోనే ఈ మూవీ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లోని విజువల్స్, యశ్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీక్వెన్స్ గురించి పెద్ద చర్చ జరిగింది. ప్రశంసలతో పాటు విమర్శలు గట్టిగానే వచ్చాయి.
టాక్సిక్ మూవీలో నయనతా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యుమా ఖురేషి, టోవినో థామస్ కీలక పాత్రల్లో న టిస్తున్నారు.
టాక్సిక్‌లో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు యశ్ కథను అందిస్తున్నారు. అంతే కాకుండా ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్ తెరకెక్కుతోంది. మార్చి 19న యశ్ టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు రణవీర్‌సింగ్ ధురంధర్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Tollywood | పర్సెంటేజీ వివాదానికి శుభం కార్డు – పెద్దికి లైన్ క్లియర్ – దిల్‌రాజు కామెంట్స్
మే 15, 2026

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్ పాత్రలో విద్యాబలన్..! ఇది మన తెలుగు సినిమానే..!
మే 13, 2026

Yellamma Movie | ఎల్లమ్మకు జోడీ దొరికిందా? – టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన సినిమాలో సీతారామం బ్యూటీ
మే 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



