త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tripti Dimri | అల‌నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్ర‌లో తిప్తి డిమ్రి – వెండితెర‌పైకి ట్రాజెడీ ల‌వ్‌స్టోరీ

అల‌నాటి బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. క‌మ‌ల్ ఔర్ మీనా పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో మీనా కుమారి పాత్ర లో త్రిప్తి డిమ్రి క‌నిపించ‌బోతుంది. డైరెక్టర్ క‌మ‌ల్ అమ్రోహీతో మీనా కుమారి విషాదాంత ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Sep 11, 2026, 4.27 pm IST

Tripti Dimri | అల‌నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్ర‌లో తిప్తి డిమ్రి – వెండితెర‌పైకి ట్రాజెడీ ల‌వ్‌స్టోరీ
Advertisement

Tripti Dimri |  సందీప్ వంగా డైరెక్ష‌న్‌లో రూపొందిన యానిమ‌ల్ మూవీతో బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యింది త్రిప్తి డిమ్రి. గ్లామ‌ర్ పాత్ర‌లో త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నఈ సుంద‌రి ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారింది. యానిమ‌ల్‌తో హీరోయిన్‌గా న‌టించిన ర‌ష్మిక మంద‌న్న కంటే త్రిప్తి డిమ్రికే ఎక్కువ పేరొచ్చింది.

బ‌యోపిక్‌...

యానిమ‌ల్ త‌ర్వాత బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసింది. ఆ స్థాయి హిట్టు మాత్రం ద‌క్క‌లేదు. గ్లామ‌ర్ పాత్ర‌లు అంత‌గా క‌లిసిరాక‌పోవ‌డంతో త‌న రూట్ మార్చింది. తొలిసారి ఓ బ‌యోపిక్ సినిమాను అంగీక‌రించింది. అల‌నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనా కుమారి జీవితం ఆధారంగా డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ పి మ‌ల్హోత్రా ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

క‌మ‌ల్ ఔర్ మీనా...

ఈ సినిమాకు క‌మ‌ల్ ఔర్ మీనా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో మీనా కుమారి పాత్ర కోసం తొలుత అలియాభ‌ట్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, దీపికా ప‌డుకోణ్‌తో పాటు చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు ఈ అవ‌కాశం త్రిప్తి డిమ్రిని వ‌రించింది. ఇటీవ‌లే హీరోయిన్‌గా ఈ బోల్డ్ బ్యూటీని డైరెక్ట‌ర్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం.

ప్రేమ‌క‌థ‌...

బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌మ‌ల్ అమ్రోహీతో మీనా కుమారి ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ బ‌యోపిక్ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. త‌న‌కంటే వ‌య‌సులో ప‌ద‌హారేళ్లు పెద్ద‌వాడైన క‌మ‌ల్‌ను మీనా కుమారి ప్రేమించింది. అప్ప‌టికే క‌మ‌ల్‌కు పెళ్లై పిల్ల‌లు ఉన్నారు. 1952లో ర‌హ‌స్యంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం త‌ర్వాత మీనా కుమారిపై క‌మ‌ల్ ఆధిప‌త్యం చెలాయించ‌డం మొద‌లుపెట్టారు. వ్య‌క్తిగ‌త జీవితం, సినిమాల విష‌యంలో మితిమీరిన జోక్యం కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి. క‌మ‌ల్ నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల త‌ర్వాత క‌మ‌ల్‌ డైరెక్ష‌న్‌లో పాకీజా సినిమా చేసింది. ఈ సినిమా రిలీజైన కొద్ది రోజుల‌కే అనారోగ్య స‌మ‌స్య‌లో మీనా కుమారి క‌న్నుమూసింది. ఆ బాధ‌తో క‌మ‌ల్‌ చ‌నిపోయారు. ఈ ట్రాజెడీ ల‌వ్‌స్టోరీతోనే క‌మ‌ల్ ఔర్ మీనా మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

సైఫ్ అలీఖాన్‌

ఇందులో క‌మ‌ల్ అమ్రోహీ పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ప్ర‌భాస్ స్పిరిట్‌...

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది త్రిప్తి డిమ్రి. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది.

 

Advertisement
Advertisement